Jagananna Colonies : రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. సీఎం జగన్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇంటి పండగకు సర్వం సిద్ధమైంది. అక్కచెల్లెమ్మల సొంత ఇంటి కలను నిజం చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికే ఏకంగా 30.75 లక్షల ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. “నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు” కింద శరవేగంగా 21.76 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. (Jagananna Colonies)
ఇప్పటికే అందజేసినవి: 30.75 లక్షల ఉచిత ఇళ్ల పట్టాలు
నిర్మాణంలో ఉన్నవి: 21.76 లక్షల ఇళ్లు
పూర్తయిన ఇళ్లు : 7.43 లక్షలు
మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
ఇవాళ కాకినాడ జిల్లా సామర్లకోటలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పేద అక్కచెల్లెమ్మలకు లాంఛనంగా ఇళ్లను అందిస్తున్నారు. జగన్ ప్రభుత్వం కడుతున్నవి ఇళ్లు కాదని, ఊళ్లు అంటూ లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పేద అక్కచెల్లెమ్మల సొంతింటి కలను నెరవేరుస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్లను అభివృద్ధి చేశారు. 71,811 ఎకరాల విస్తీర్ణంలో 30.75 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయింది. ఒక్కో ఫ్లాట్ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పలుకుతోంది. ఆ కనీస విలువ రూ. 2.5 లక్షల చొప్పున లెక్కించినా ఇళ్ల పట్టాల విలువ రూ.76,000 కోట్ల పైమాటే. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లులో భాగంగా 21.76 లక్షల మందికి ఇళ్లు కట్టడానికి ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షల చొప్పున చేస్తున్న ఖర్చు రూ. 56,700 కోట్లు.
ఇంటి స్థలం ప్రాంతాన్ని బట్టి రూ.2.50 లక్షల నుండి రూ.15లక్షల వరకు ఉంటున్న నేపథ్యంలో ఆ ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా రూ. 1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందిస్తూ, మరోవైపు పావలా వడ్డీకి రూ. 35 వేల చొప్పున బ్యాంకు రుణం.. దీంతో పాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ధి.. మొత్తం రూ. 2.70 లక్షలతో ఒక్కో ఇంటి నిర్మాణం.
వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్లలో రూ. 32,900 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్, సీసీ రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పించడంతోపాటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సెంటర్లు వంటి సామాజిక మౌలిక వసతులను కూడా.. ఏర్పాటు చేసి మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం…
అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల పేరు మీద ఇళ్ల పట్టాలు, ఇళ్ళ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు కనీసం రూ. 5 లక్షల నుండి రూ.20 లక్షల వరకు లబ్ధి… రాష్ట్రవ్యాప్తంగా పేద అక్క చెల్లెమ్మల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుండి రు. 3 లక్షల కోట్ల సంపద.
కేవలం 1 రూపాయికే సర్వహక్కులతో లబ్ధిదారులకు 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ళు అందజేత. రాష్ట్రవ్యాప్తంగా – 2.62 లక్షల టిడ్కో లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ. 11,672 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ. 1,200కోట్లు, మౌలిక వసతులకు మరో రూ. 3,247 కోట్లు, 365 చ.అడుగుల, 430 చదరపు అడుగుల ఇళ్ళకు ముందస్తు వాటా చెల్లింపులో 50 శాతం రాయితీగా రూ. 482 కోట్లు కలిపి మొత్తంగా రూ.16, 601 కోట్ల మేర లబ్ది అందిస్తున్న ప్రభుత్వం.
ఇదీ చదవండి: YSRCP Leaders: పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు