YSRCP Leaders: పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

YSRCP Leaders: పార్టీ ప్రతినిధుల సమావేశంతో అధికార వైయస్సార్‌సీపీలో కొత్త జోష్ వచ్చింది. ఇదే జోష్‌లో ప్రజల్లోకి వెళ్లి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలోనూ గెలవాలని తీవ్ర ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సీఎం జగన్‌ నిన్న క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు వారికి ఇచ్చారు. (YSRCP Leaders)

పేదవాడు మన పార్టీని ఓన్‌ చేసుకొనేలా పార్టీ శ్రేణులంతా ప్రజల్లోకి వెళ్లి మనం చేసిన మంచిని చెప్పాలని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. దసరా తర్వాత రెండు నెలల పాటు బస్సు యాత్రలు నిర్వహించాలని ఆదేశించారు. పార్టీ ప్రతినిధులు సమావేశంలో నిర్దేశించిన కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలతో సీఎం జగన్‌ సమావేశమై ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

సీఎం ఏమన్నారంటే..

– బస్సు యాత్ర మీటింగుల ఏర్పాట్లను సమన్వయ పరచడానికి ముగ్గురు పార్టీ నాయకుల నియామకం.
– ఈనెల 26 నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సమావేశాలు జరగాలి.
– రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి రోజూ ఒక మీటింగ్‌ చొప్పున మొత్తంగా మూడు మీటింగులు నిర్వహించాలి.
– ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. విజయవంతంగా జరగాలి.

– స్థానిక ఎమ్మెల్యే లేదా పార్టీ ఇన్‌ఛార్జి సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు ఈ సమావేశాల్లో మాట్లాడాలి.
– 52 నెలల పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ మీటింగుల ద్వారా వివరించాలి.
– జరుగుతున్నది కులాల వార్‌ కాదు, ఇది క్లాస్‌ వార్‌. పేదవాడు మన పార్టీని ఓన్‌ చేసుకోవాలి.
– నియోజకవర్గాల వారీగా సమావేశాలపై తేదీ, స్థలం సహా పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలి.
– సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అంశాలను ప్రస్తావించాలి.

– పార్టీ ప్రతినిధులు సమావేశంలో ప్రకటించిన కార్యక్రమాలపై
నియోజకవర్గాల్లో అవగాహన కల్పించాలి.
– అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే అవగాహన సమావేశంలో గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వాలంటీర్లు ఈ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలి.
– జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను రీజినల్‌ కో–ఆర్డినేటర్లు సందర్శించాలి.

– ఎమ్మెల్యేలతో కలిసి.. ఈ కార్యక్రమం సమర్థవంతంగా జరిగేలా చూడాలి.
– కార్యక్రమంలో విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మర్రి రాజశేఖర్, ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి, రామసుబ్బారెడ్డి, తలశిల రఘరామ్, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Krishna Water: కృష్ణాజలాలపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమావేశం

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles