Inorbit mall Vizag: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద ఇనార్బిట్ మాల్ విశాఖపట్నంలో రాబోతోంది. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. వైజాగ్‌లో రూ. 600 కోట్లతో ఇనార్బిట్ మాల్‌ను రహేజా గ్రూప్ నిర్మిస్తోంది. 250కి పైగా బ్రాండ్లకు వేదిక కానుంది. దీంతో 8 వేల మందికి ఉపాధి లభించనుంది.- రెండో దశలో ఐటీ క్యాంపస్, మూడో దశలో స్టార్ హోటల్ నిర్మాణం జరగనున్నాయి. నేడు సీఎం జగన్ చేతుల మీదుగా మాల్‌కు శంకుస్థాపన జరగనుంది. (Inorbit mall Vizag)
నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైజాగ్‌లో పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబెషన్ సెంటర్, బయో మానిటరింగ్ హబ్ సహా 5 ప్రాజెక్టులకు సంబంధించి భవనాలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. అనంతరం ఏయూ విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్ ఇంటరాక్ట్ కానున్నారు.
Read Also : CM YS Jagan Review: భారీ వర్షాలు, వరద ప్రవాహం, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష
విశాఖపట్నం, విజయవాడలో సీటింగ్ కెపాసిటీ 350కి పెంపు
ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో కీలక ప్రకటన చేసింది. విశాఖ క్యాపంస్‌లో అదనంగా మరో వెయ్యి సీట్లు పెంచుతున్నట్లు విప్రో పేర్కొంది. విజయవాడకు అదనంగా.. తిరుపతిలో హెచ్‌సీఎల్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపింది. గడిచిన నాలుగేళ్లలో ఐటీ రంగంలో కొత్తగా 29,500 ఉద్యోగాల కల్పన సాకారమైంది. 2014-19 ఐదేళ్ల కాలంలో ఐటీ ఉద్యోగులు 24,350 కంటే ఇప్పుడు 53,850కి పెరుగుదల కావడం విశేషం.
Read Also : AP Appulu: ఏపీ అప్పులపై కేంద్రం స్పష్టత.. జగన్ సర్కారు చేసిన అప్పు ఎంతంటే..?