Gadikota Srikanth Reddy: రాష్ట్రంలో వ్యవస్థను గాడిన పెట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలిచారని వైయస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయాల్లో విలువలు పాటించడంలో జగన్ మార్గదర్శకుడని కితాబిచ్చారు. పవన్ ను చంద్రబాబు బొమ్మలా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ట్రాప్ లో పడి రోజురోజుకూ పవన్ దిగజారిపోతున్నారని, గతంలో టీడీపీ చేసిన తప్పులను పవన్ ఎత్తిచూపలేదని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. (Gadikota Srikanth Reddy)
గత ప్రభుత్వ పాలనతో చెడిపోయిన వ్యవస్థలను సీఎం జగన్ గాడిన పెడుతున్నారని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పాలనను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్న ఆయన.. చంద్రబాబు తన జీవితమంతా వెన్ను పోట్లకే పరిమితమయ్యారని మండిపడ్డారు. ప్రజలు తనకు గుణపాఠం చెప్పారని చంద్రబాబు అంగీకరించడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ట్రాప్‌లో పడిపోయారని, పవన్ రోజురోజుకూ ఉన్మాదిలా మారిపోతున్నారని చెప్పారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంతోమందిని బలి చేశారని తెలిపారు.
Read Also : MP Margani Bharath: వలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్నారు.. : ఎంపీ మార్గాని భరత్
చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పవన్ బలిపశువు కాబోతున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. పవన్ గత ప్రభుత్వం వైఫల్యాలను ఎందుకు ప్రశ్నించడని నిలదీశారు. చంద్రబాబు ఎవరిని ప్రశ్నించమంటే పవన్ వారిని ప్రశ్నిస్తారని, పవన్ ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలని సూచించారు. పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు.. స్వతహాగా రాజకీయాలు చేయాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎవరు తనను పిలుస్తారోనని చంద్రబాబు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
సొంతంగా 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని గడికోట ఎద్దేవా చేశారు. పవన్ మహిళా సీఐని టార్గెట్ చేశారని, ధర్నాకు వచ్చిన జనసేన కార్యకర్తలను సీఐ వారించారని గడికోట చెప్పారు. వలంటీర్ వ్యవస్థపై పవన్ ఉన్మాదిలా మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయలసీమకు చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్‌నైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. ఏ రోజైనా రాయలసీమ అభివృద్ధి గురించి ఆలోచించారా? అని నిలదీశారు. మహానేత వైఎస్సార్ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అడ్డుపడ్డావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : Ambati on pawan: వారాహి ఎక్కి పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు: మంత్రి అంబటి