MP Margani Bharath: వలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్నారు.. : ఎంపీ మార్గాని భరత్

MP Margani Bharath: ఏపీలో వలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గడం లేదు. అధికార పార్టీ నేతలు నాలుగు రోజులుగా పవన్‌ను ఏకిపారేస్తున్నారు. మరోవైపు పవన్‌ కూడా రోజూ వలంటీర్లపై ఏదో ఒకరకంగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగా మరో టర్న్‌ తీసుకొనేలా కనిపిస్తోంది. తాజాగా పవన్‌పై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ రియాక్ట్‌ అయ్యారు. వలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పని చేస్తున్నారని, అలాంటి వారిపై విమర్శలు అర్థరహితమని పవన్‌కు కౌంటర్ ఇచ్చారు మార్గాని భరత్‌. (MP Margani Bharath)

ఒకటో తేదీనే వలంటీర్లు పింఛన్లు అందిస్తున్నారని ఎంపీ భరత్‌ గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల పంపిణీ ఎలా ఉండేదని ప్రశ్నించారు. పవన్ గత ప్రభుత్వ వైఫల్యాల పై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. వలంటీర్లు పార్టీకి సంబంధం లేకుండా పనిచేస్తున్నారని ఎంపీ భరత్‌ స్పష్టం చేశారు. పవన్ రెండు రోజుల్లోనే వలంటీర్ల పై మాట మార్చారని తెలిపారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకునేవారా? కాదా? చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం అందిస్తోందని వివరించారు.

Read Also : Pawan Kalyan on Volunteers: మారిన పవన్‌ స్వరం.. వలంటీర్లు తనకు సోదర సమానులన్న జనసేనాని!

అక్కచెల్లెమ్మలకు వ్యతిరేకంగా పవన్ వ్యవహరిస్తున్నారంటూ ఎంపీ భరత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కుట్రకు కథ ఇచ్చేది ఈనాడు పత్రిక అని, నిర్మాత చంద్రబాబు అని ఎంపీ భరత్‌ అన్నారు. ఈ కుట్రలో నటుడు పవన్ కల్యాణ్‌ అన్నారు. రాజకీయాల్లో పవన్ పెద్ద జోకర్ అంటూ విమర్శించారు. సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తున్న విషయం కనిపించలేదా? అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల వారికే సంక్షేమ పథకాలు అందిన విషయాన్ని ప్రస్తావించారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ప్రజలు పట్టం కడతారనే భయం పవన్ లో కనిపిస్తోందని ఎంపీ భరత్‌ వ్యాఖ్యానించారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గతంలో ఇలా జరగలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.2.25 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా అందాయని గుర్తు చేశారు. సచివాలయం వ్యవస్థ పారదర్శకంగా పనిచేస్తోందని ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు.

పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ విప్లవం చేస్తున్నాడు? ఏం విప్లవం చేశాడు. సినిమాల్లో చాలా చేయవచ్చు. ఏదో సినిమాలోఒక ప్యాంటుపై మరో సగం ప్యాంటు వేశాడు.. బయట కూడా అలా వేస్తాడా.. అని ఎంపీ మార్గాని భరత్‌ ప్రశ్నలు గుప్పించారు.

Read Also: Minister Roja: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారు.. పవన్‌పై మంత్రి రోజా ఆగ్రహం

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles