AP Medical News: ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ కోసం వాకిన్ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన వెలువరించింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి వాకిన్ రిక్రూట్మెంట్ చేపడుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో ఈ రిక్రూట్‌మెంట్ చేపడుతున్నారు. ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు మెంబర్ సెక్రెటరీ ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. (AP Medical News)
రెగ్యులర్ (పరిమిత/జనరల్ రిక్రూట్ మెంట్), కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించే ఈ పోస్టుల అర్హతా ప్రమాణాలు, నిర్ణీత మార్గదర్శకాలను https://hmfw.ap.gov.in వెబ్ సైట్‌ను సందర్శించి పొందవచ్చని ఎం.శ్రీనివాసరావు సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను వాకిన్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో సమర్పించాలని ఆయన తెలిపారు.
వాకిన్ రిక్రూట్ మెంట్ షెడ్యూలు వివరాలు..
* సెప్టెంబర్ 5న: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాలకు..
* సెప్టెంబర్ 7న: గైనకాలజీ, అనెస్థీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ విభాగాలకు..
* సెప్టెంబర్ 10న: పెడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్థమాలజీ, రేడియాలజీ, గుండె వ్యాధుల విభాగాలకు..
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నియామక ప్రక్రియ ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Women Missing cases: ఏపీ, తెలంగాణలో బాలికలు, మహిళల అదృశ్యం పై కేంద్రం ప్రకటన