CM Jagan Good News: కాంట్రాక్టు ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీపి కబురు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు ఐదేళ్ల నిబంధన తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ సీఎం నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి కాంట్రాక్ట్ ఉద్యోగులు వినతిపత్రాలు ఇచ్చారు.
2014, జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కేబినెట్ లో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. వీలైనంత ఎక్కువమంది ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే ఉద్దేశంతో ఐదేళ్ల నిబంధన తొలగించారు సీఎం జగన్. 2014 జూన్ 2కు ముందు నియమించబడి ఇప్పటివరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఎంతమందికి మేలు జరుగుతుందో అన్నదాని పై తేలాల్సి ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఫైలు పై సీఎం జగన్ సంతకం చేశారు. త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ స్వాతంత్య్ర దినోత్సవ కానుక అందించింది. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసిన సీఎం జగన్.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఫైల్ పై సంతకం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ పై నాలుగు రోజుల్లో ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. 2014, జూన్ 2 ముందు నియమింపబడిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ కానున్నారు.
ఇదీ చదవండి: Central Cabinet Meeting: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
[…] […]