AP Govt hike archakas salary: అర్చకులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో పని చేసే అర్చకులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ పెంపుపై కూడా కీలక నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిటైర్‌మెంట్ ఏజ్‌ను 62 ఏళ్లకు పెంచే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న2,625 మంది అర్చకులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. (AP Govt hike archakas salary)
నేడు మీడియాతో మాట్లాడిన మంత్రి కొట్టు సత్యనారాయణ.. (Minister Kottu Satyanarayana) సీఎం జగన్ (CM YS Jagan) ఇచ్చిన హామీ నెరవేర్చడంలో భాగంగా అర్చకులకు వేతనాలు పెంచినట్లు తెలిపారు. గతంలో అర్చకులకు ఇచ్చిన హామీ మేరకు అర్చకుల వేతనాలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే రూ.5 వేల వేతనాన్ని తీసుకుంటున్న అర్చకుల వేతనాన్ని రూ.10కు పెంచినట్లు తెలిపారు. అలాగే రూ.10వేలు తీసుకుంటున్న అర్చకుల వేతనాన్ని రూ.15,600కు పెంచినట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యానారాయణ వివరించారు.
రాష్ట్రంలో గ్రేడ్-3 దేవాలయాల్లో పనిచేస్తున్న ఈవోలకు ఇచ్చిన పదోన్నతి ఉత్తర్వులను నిలుపుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లోని ఇంజనీరింగ్, విద్యుత్ విభాగాల్లో చాలా వరకు సాంకేతిక సిబ్బంది పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని, ఈ నియామకాలకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.
దేవాలయాలకు చెందిన ఆస్తుల పరిరక్షణకు సెక్షన్ 83లో సవరణలు తీసుకొచ్చామన్నారు. ఎవరైనా దేవాలయాల ఆస్తులను ఆక్రమించుకుంటే 8 ఏళ్ల వరకూ శిక్షపడేలా చట్టంలో మార్పులు తెచ్చామని వివరించారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ,వార్డు వలంటీర్ల వ్యవస్థ గురించి కొట్టు సత్యనారాయణ స్పందిస్తూ.. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు 2 లక్షల 60 వేల మంది యువతకు గ్రామ,వార్డు వలంటీర్లుగా ఉపాధి కల్పించినట్లు తెలిపారు. వీరి నియామకంలో సామాజిక న్యాయాన్నిపాటించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం సీఎం జగన్ నియమించారన్నారు. వలంటీర్లలో లక్షా 80 వేల మంది వరకు మహిళలే ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ వంతున కోటీ 60 లక్షల కుటుంబాలకు వీరు సేవలందిస్తున్నారన్నారు.
Read Also : Minister Roja: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారు.. పవన్‌పై మంత్రి రోజా ఆగ్రహం