శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Andhra Pradesh Elections: ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 ఎంపీ స్థానాలకు 545 మంది పోటీ

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 2 మే 2024

Andhra Pradesh Elections: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. లోక్‌ సభ, అసెంబ్లీ స్థానాల్లో ఫైనల్‌గా బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెల 29న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 25 పార్లమెంటు స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 అభ్యర్థులు మిగిలారు.

మే 13 న జరిగే ఎన్నికల్లో వీరంతా అధికారికంగా పోటీ చేస్తున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం నామినేషన్ల ఉపసంహరణ ముగిసిందని, పెద్ద ఎత్తులు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలకు మొత్తం 2,387 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని పేర్కొన్నారు.

పార్లమెంటు స్థానాలకు సంబంధించి 49 మంది అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 318 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ఆయన తెలిపారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 25 పీసీలకు సంబంధించి మొత్తం 503 మంది అభ్యర్థులు, 175 ఏసీలకు సంబంధించి మొత్తం 2,705 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసినట్లు మీనా తెలిపారు.

పీసీలకు సంబంధించి అత్యధిక మొత్తంలో విశాఖ పార్లమెంటు స్థానానికి 33 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు రాజమండ్రి పార్లమెంటు స్థానానికి పోటీపడుతున్నారని తెలిపారు. ఏసీ స్థానాలకు సంబంధించి అత్యధికంగా 46 మంది అభ్యర్థులు తిరుపతి ఏసీలో, అత్యల్పంగా 6 మంది అభ్యర్థులు చోడవరం ఏసీలోను పోటీపడుతున్నారని వివరించారు.

ఇవీ చదవండి: SAMARTH APP: క్విక్‌ పోలీసింగ్‌ కోసం సమర్థ్‌ మొబైల్ యాప్‌ తీసుకొచ్చిన ఈసీ
EC Serious: పేరులేని రాజకీయ హోర్డింగ్‌లపై ఈసీఐ కొరడా
ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
CEC: ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకూడదు: ఈసీ కీలక సూచనలు
CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ

ట్యాగ్స్: , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading