Ration Cards: రేషన్ కార్డులకు సంబంధించిన సేవలను మరింత సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న సేవలను ఇప్పుడు మరింత వేగంగా పొందేలా కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి తగ్గనుంది.
మీ సేవ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ సేవలు
ఇకపై రేషన్ కార్డు సేవలను మీ సేవ కేంద్రాలు మరియు మీ సేవ పోర్టల్ ద్వారా కూడా పొందే అవకాశం కల్పించారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం, సభ్యులను చేర్చడం లేదా తొలగించడం, కార్డు విభజన, వివరాల అప్‌డేట్, ఆధార్ లింకింగ్, డూప్లికేట్ కార్డు పొందడం వంటి మొత్తం తొమ్మిది రకాల సేవలు ఈ విధానం ద్వారా అందుబాటులోకి వచ్చాయి.
ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే లక్ష్యం
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో అధిక రద్దీ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. అధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల రేషన్ కార్డు సేవలు ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యలను తగ్గించేందుకు మీ సేవ పోర్టల్ ద్వారా సేవలను విస్తరించారు.
కొత్త రేషన్ కార్డు కోసం అవసరమైన పత్రాలు
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పెళ్లి పత్రిక, ఆధార్ కార్డు కాపీలు, ఫొటోలు సమర్పించాలి. అలాగే వివరాల్లో మార్పులు చేయాలంటే ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికేట్ వంటి ధృవీకరణ పత్రాలు అవసరం అవుతాయి.
అర్హత పరిశీలన తర్వాత కార్డు జారీ
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి గడువు లేదు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తు అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తారు. అర్హత ఉన్న వారికి స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేస్తోంది.
ఇవీ చదవండి: Free Ration Big Update: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. మూడు నెలల రేషన్ ఒకేసారి.. కేంద్రం కీలక నిర్ణయం
Pawan Kalyan Remunaration: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ తగ్గించారా? నెట్టింట ఆసక్తికర చర్చ
BITSAT 2026 Registration: బిట్‌శాట్ 2026 ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల – పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే
