BITSAT 2026 Registration: రాజస్థాన్ రాష్ట్రం పిలానీలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS Pilani) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం BITS Admission Test (BITSAT)–2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బిట్‌శాట్ స్కోర్ ఆధారంగా పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ఇంటర్మీడియట్ అర్హతతో బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. బిట్‌శాట్–2026 పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనుండగా, అభ్యర్థులు రెండు సెషన్లు రాయవచ్చు. ఈ రెండు సెషన్లలో వచ్చిన స్కోర్లలో బెస్ట్ స్కోర్‌ను మాత్రమే తుది మెరిట్‌గా పరిగణనలోకి తీసుకుంటారు.
అంతర్జాతీయ 2+2 జాయింట్ ప్రోగ్రామ్‌లకు అవకాశం
బీఈ, ఎంఎస్సీ, బీఫార్మసీ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు భారత్‌తో పాటు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివే అవకాశాన్ని కూడా బిట్స్ కల్పిస్తోంది. ఆస్ట్రేలియాలోని RMIT University (Melbourne), అమెరికాలోని Iowa State University, University at Buffalo (New York), Rensselaer Polytechnic Institute (New York), ఫ్రాన్స్‌లోని CentraleSupélec (Paris) వంటి ప్రముఖ వర్సిటీలతో 2+2 జాయింట్ కొలాబరేటివ్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు భారత్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో చదివి, మిగిలిన రెండేళ్లు ఎంపిక చేసుకున్న విదేశీ యూనివర్సిటీలో పూర్తి చేయవచ్చు.
బిట్‌శాట్ 2026 ద్వారా అందించే కోర్సులు
బిట్స్ పిలానీ – పిలానీ క్యాంపస్
బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎన్విరాన్‌మెంటల్ అండ్ సస్టెయినబుల్ ఇంజినీరింగ్
బీఫార్మసీ
ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సెమికండక్టర్ అండ్ నానోసైన్స్, జనరల్ స్టడీస్
బిట్స్ పిలానీ – కేకే బిర్లా గోవా క్యాంపస్
బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎన్విరాన్‌మెంటల్ అండ్ సస్టెయినబుల్ ఇంజినీరింగ్
ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సెమికండక్టర్ అండ్ నానోసైన్స్
బిట్స్ పిలానీ – హైదరాబాద్ క్యాంపస్
బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎన్విరాన్‌మెంటల్ అండ్ సస్టెయినబుల్ ఇంజినీరింగ్
బీఫార్మసీ
ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సెమికండక్టర్ అండ్ నానోసైన్స్
అర్హతలు
బిట్స్ పిలానీలో ప్రవేశాల కోసం అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. బిట్‌శాట్–2026లో వచ్చిన మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లు ఇస్తారు.
దరఖాస్తు విధానం & ఫీజు
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెషన్–1, సెషన్–2 పరీక్షలకు కలిపి దరఖాస్తు ఫీజు రూ.5400, మహిళా అభ్యర్థులకు రూ.4400గా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు
బిట్‌శాట్ 2026 సెషన్–1 దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 15, 2026
సెషన్–1 దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 16, 2026
బిట్‌శాట్ సెషన్–1 పరీక్ష తేదీలు: ఏప్రిల్ 15 నుంచి 17 వరకు
సెషన్–2 దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 20, 2026
సెషన్–2 దరఖాస్తుకు చివరి తేదీ: మే 2, 2026
బిట్‌శాట్ సెషన్–2 పరీక్ష తేదీలు: మే 24 నుంచి 26 వరకు
ఇవీచదవండి: APPSC Exam Schedule 2026: ఏపీపీఎస్సీ విడుదల చేసిన 21 నోటిఫికేషన్‌లకు పరీక్షల పూర్తి షెడ్యూల్
