Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించింది. మార్చి 13న రైతుల బ్యాంక్ అకౌంట్లలో మొత్తం రూ.6 వేల చొప్పున జమ చేశారు. అయితే కొంతమంది రైతులకు డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
1. రైతుల అకౌంట్లలో రూ.6 వేల జమ
మార్చి 13న గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఇందులో పీఎం కిసాన్ కింద రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు జమ అయ్యాయి.
2. డబ్బులు పడకపోవడానికి ప్రధాన కారణాలు
బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ కాకపోవడం, ఎన్పీసీఐ మ్యాపింగ్ లేకపోవడం, ఆధార్ ఈకేవైసీ పెండింగ్‌లో ఉండటం, భూమి రికార్డుల్లో తప్పులు ఉండటం వంటి కారణాలతో డబ్బులు ఆగిపోవచ్చు.
3. ముందుగా కారణం తెలుసుకోండి
డబ్బులు జమ కాకపోతే రైతులు తమ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి కారణం తెలుసుకోవాలి. అలాగే రైతు సేవా కేంద్రంలో కూడా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.
4. భూమి వివరాలు తప్పులుంటే సరిచేయాలి
ల్యాండ్ రికార్డుల్లో తప్పులు ఉంటే భూమి వెబ్‌సైట్‌లో చూసుకుని ఎమ్మార్వో కార్యాలయంలో సరిచేసుకోవాలి. మార్చి 31లోగా తప్పులు సరిచేస్తే డబ్బులు అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంటుంది.
5. ఆధార్, బ్యాంక్ లింక్ తప్పనిసరి
ఆధార్–బ్యాంక్ లింక్, ఎన్పీసీఐ యాక్టివేషన్, ఈకేవైసీ పూర్తి చేయాలి. అవసరమైతే బ్యాంక్ లేదా రైతు సేవా కేంద్రంలో అప్డేట్ చేయించుకోవాలి. సమస్య కొనసాగితే 155261 లేదా 1902 హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ఇవీ చదవండి: Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు విడుదల.. మీకు రాకపోతే ఏం చేయాలి?
Annadata Sukhibhava: ఏపీ రైతులకు శుభవార్త… ‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదల
Annadata Sukhibhava: రైతులకు పెట్టుబడి సాయంలో ప్రభుత్వ అలక్ష్యం.. ఇప్పటికే 7 లక్షల మంది రైతులకు సాయం కట్
YSRCP Annadata Poru : అన్నదాత పోరును అడ్డుకోవడం దారుణం
