HomeAndhra PradeshAP EAPCET 2026: దరఖాస్తుకు గడువు దగ్గర.. తెలుసుకోవాల్సిన టాప్ 5 ముఖ్య విషయాలు

AP EAPCET 2026: దరఖాస్తుకు గడువు దగ్గర.. తెలుసుకోవాల్సిన టాప్ 5 ముఖ్య విషయాలు

AP EAPCET 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే AP EAPCET 2026 (Engineering, Agriculture and Pharmacy Common Entrance Test)కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన టాప్ 5 ముఖ్య విషయాలు ఇవి.

1. దరఖాస్తు గడువు
ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 17, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు మిస్ అయితే ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఆలస్య రుసుముతో తేదీలు:
మార్చి 21 వరకు – ₹1000
మార్చి 25 వరకు – ₹2000
మార్చి 30 వరకు – ₹4000
ఏప్రిల్ 3 వరకు – ₹10,000

2. పరీక్ష తేదీలు
ఈ ఏడాది కూడా జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (JNTUK) ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
పరీక్షలు మే 12 నుంచి మే 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయి.
ఇంజినీరింగ్ పరీక్షలు: మే 12, 15, 18
అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్షలు: మే 19, 20

3. హాల్ టికెట్లు ఎప్పుడు?
ఈఏపీసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ 28 నుంచి హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

4. అర్హతలు
AP EAPCET దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు
ఇంటర్మీడియట్‌లో MPC లేదా BiPC గ్రూపులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కనీసం 25% మార్కులు ఉండాలి.
SC/ST అభ్యర్థులకు
40% మార్కులతో ఉత్తీర్ణత సాధించినా అర్హత ఉంటుంది.

5. రిజిస్ట్రేషన్ ఫీజు
దరఖాస్తు సమయంలో అభ్యర్థులు కింది విధంగా ఫీజు చెల్లించాలి.
జనరల్ అభ్యర్థులు – ₹800
BC అభ్యర్థులు – ₹750
SC / ST / PH అభ్యర్థులు – ₹700

ఈ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థులకు
BE / BTech
BSc (Agriculture)
BPharmacy
Pharm-D వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతుంటారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం ఉంది. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు మార్చి 17 లోపు తప్పకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చ‌ద‌వండి: NCET 2026 : ఉపాధ్యాయ వృత్తిని లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులకు శుభవార్త.. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – NCET 2026 నోటిఫికేషన్ విడుదల‌
TS LAWCET : తెలంగాణలో ఈసెట్, లాసెట్ షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. విద్యార్థులకు కీలక ప్రకటన
MacBook Neo: తక్కువ ధరలో Apple ల్యాప్‌టాప్: MacBook Neo… పవర్‌ఫుల్ పనితీరు, ఎకో-ఫ్రెండ్లీ డిజైన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు