HomeAgricultureAnnadata Sukhibhava: అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు విడుదల.. మీకు రాక‌పోతే ఏం చేయాలి?

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు విడుదల.. మీకు రాక‌పోతే ఏం చేయాలి?

Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించే అన్నదాత సుఖీభవ పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. గన్నవరంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఈ నిధులను అధికారికంగా విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలోని రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి.

రైతుల ఖాతాల్లో రూ.6 వేల జమ
ఈ పథకం కింద రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కలిపి ఆర్థిక సహాయం అందుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో రూ.4 వేలు జమ చేసింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM Kisan Samman Nidhi పథకం కింద రూ.2 వేలు జమయ్యాయి.
దీంతో ఒక్కో రైతు ఖాతాలో మొత్తం రూ.6 వేల చొప్పున జమయ్యాయి.

కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా ఈ మూడో విడత నిధులను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు రూ.20 వేల వరకు ఆర్థిక సహాయం అందుతోంది. మొదటి రెండు విడతలుగా ఇప్పటికే రూ.14 వేల అందించారు ఇప్పుడు మూడో విడతగా రూ.6 వేల విడుదల చేయడంతో ఒక్కో రైతుకు మొత్తం రూ.20 వేల అందినట్లైంది.

స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
రైతులకు డబ్బులు జమయ్యాయా లేదా అనేది ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ పోర్టల్ అందుబాటులో ఉంచింది.

స్టేటస్ చెక్ చేసే విధానం:
https://annadathasukhibhava.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
హోమ్‌పేజీలో Know Your Status ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి
సెర్చ్ బటన్‌పై క్లిక్ చేస్తే పేమెంట్ వివరాలు కనిపిస్తాయి
అక్కడ ఈ-కేవైసీ యాక్టివ్‌లో ఉందా లేదా అన్న సమాచారం కూడా తెలుసుకోవచ్చు.

డబ్బులు రాకపోతే ఏం చేయాలి?
ఒకవేళ అర్హత ఉన్నా డబ్బులు ఖాతాలో జమ కాకపోతే రైతులు దగ్గరలోని రైతు సేవా కేంద్రం లేదా గ్రామ / వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు.

టోల్ ఫ్రీ నెంబర్
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు అందకపోతే రైతులు 155251 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
అర్హత ఉన్న రైతులందరికీ ఈ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అర్హులైన ఒక్క రైతు కూడా పథకం ప్రయోజనం పొందకుండా మిగలకూడదని ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చ‌ద‌వండి: Annadata Sukhibhava: ఏపీ రైతులకు శుభవార్త… ‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదల
Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ రెండో విడత.. 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్లు
Annadata Sukhibhava : తొలి ఏడాది కట్.. ఆగస్ట్ 2న ‘అన్నదాత సుఖీభవ’ నిధులు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు