HomeAndhra PradeshGood News on Gas: వంటింట్లో గ్యాస్ బాధ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్.. గల్ఫ్ ఉద్రిక్తతల...

Good News on Gas: వంటింట్లో గ్యాస్ బాధ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్.. గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య కీల‌క ప్ర‌క‌ట‌న

Good News on Gas: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ఇండియాలో గ్యాస్ కొర‌త‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉద్రిక్త పరిస్థితుల వేళ వంట గ్యాస్ కొర‌త ఏర్ప‌డుతుందేమోన‌న్న అపోహ‌ల‌పై క్లారిటీ ఇచ్చింది. బుకింగ్‌ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్‌ డెలివరీ చేస్తార‌ని వెల్ల‌డించింది. LPG ఉత్పత్తిని 25% పెంచామని, హార్ముజ్‌ జలసంధితో సంబంధం లేని రూట్ల ద్వారా చమురు దిగుమతి చేసుకుంటున్నట్టు ప్ర‌క‌టించింది. హార్ముజ్‌ నుంచి ఆగిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించినట్టు కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రించింది.

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం:
పశ్చిమాసియాలో ఇరాన్ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు రావాల్సిన చమురు సరఫరాపై కొంత ప్రభావం పడింది.

ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు కొనుగోలు:
హర్మోజ్ జలసంధితో సంబంధం లేని ఇతర మార్గాల ద్వారా భారత్ చమురును కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీంతో చమురు సరఫరా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఎల్పీజీ సరఫరా అంతరాయం లేదు:
దేశంలో గ్యాస్ కొరత ఉండదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వినియోగదారులు బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ సాధారణంగా ఉండే విధంగానే ఒకటి లేదా రెండు రోజుల్లో ఇంటికే డెలివరీ అవుతుందని తెలిపింది.

దేశంలో నిల్వలు పెంపు:
ప్రభుత్వ చర్యల వల్ల ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ నిల్వలు సుమారు 25 శాతం పెరిగాయని అధికారులు వెల్లడించారు. దీంతో గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొన్నారు.

వినియోగదారులకు కేంద్రం భరోసా:
గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ భారత్‌కు చమురు సరఫరా కొనసాగుతోందని, కాబట్టి గ్యాస్ కొరతపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం హామీ ఇచ్చింది.

ఇవీ చ‌ద‌వండి: Good News : దేశ ప్రజలకు కేంద్రం బిగ్ గుడ్‌న్యూస్.. నెలకు రూ.5 వేల వరకు పెన్షన్ పొందే అవకాశం.. కేబినెట్ కీలక ఆమోదం
Good News for Farmers: రైతులకు కేంద్రం శుభవార్త: గోధుమలు, చక్కెర ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్
Good News : వాహనదారులకు పండుగ గిఫ్ట్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ ప్రయాణం? హైదరాబాద్–విజయవాడ హైవేపై తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రతిపాదన

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు