HomeAstrologyTaurus 2026: శ్రీ ప‌రాభ‌వ‌ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి జాగ్రత్తలు.. ఉగాది ముందు...

Taurus 2026: శ్రీ ప‌రాభ‌వ‌ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి జాగ్రత్తలు.. ఉగాది ముందు ఈ పరిహారాలు చేస్తే మంచిదట

Taurus 2026: భారతీయ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక నామంతో ప్రారంభమవుతుంది. ఈసారి ప్రారంభమవుతున్న శ్రీ ప‌రాభ‌వ నామ సంవ‌త్స‌రం గురించి జ్యోతిష్యులు కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో 12 రాశుల్లో ఒక రాశి వారికి కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం Taurus (వృషభ రాశి) వారికి ఈ సంవత్సరంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉగాది పండుగకు ముందు కొన్ని పరిహారాలు చేస్తే ప్రతికూల ప్రభావం కొంతవరకు తగ్గుతుందని వారు సూచిస్తున్నారు.

ఉగాది ముందు చేయాల్సిన పరిహారాలు
ఉగాది ముందు రోజు వృషభ రాశి వారు కొన్ని ఆచారాలను పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఉదయం లేచిన వెంటనే నువ్వుల నూనెతో స్నానం చేయడం శుభప్రదమని అంటున్నారు.
ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
ఉగాది ముందు రోజు ఇంట్లో పూజ చేసి హారతి ఇవ్వడం మంచిదని చెబుతున్నారు.
ఇంటి ముందు అగరబత్తీలు వెలిగించడం, ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని విశ్వాసం.

వినాయకుడి పూజ ముఖ్యమట
పూజ గదిలో Ganesha ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచి పూజ చేయాలని సూచిస్తున్నారు. వినాయకుడిని ప్రార్థించడం వల్ల అడ్డంకులు తొలగి శుభఫలితాలు వస్తాయని జ్యోతిష్య నమ్మకం.

దంపతులు కలసి భోజనం చేయాలి
ఉగాది రోజున ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేయాలని, ఆ రోజున ఎలాంటి గొడవలు పడకుండా ప్రశాంతంగా గడపాలని సూచిస్తున్నారు. కుటుంబంలో సౌహార్ద వాతావరణం ఉంటే సంవత్సరం మొత్తం మంచి ఫలితాలు పొందే అవకాశముందని అంటున్నారు.

జ్యోతిష్యుల ప్రకారం ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల వృషభ రాశి వారికి వచ్చే ప్రతికూల ప్రభావాలు కొంతవరకు తగ్గి కొత్త సంవత్సరం శుభప్రదంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇవీ చ‌ద‌వండి: Ugadi astrology: ఉగాది ముందు గ్రహ మార్పుల ప్రభావం.. ఈ 5 రాశులకు అదృష్ట యోగం
Ugadi: ఉగాది నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం… అష్టైశ్వర్యాలు వరించనున్నాయా?
Ugadi Astrology: ఉగాది 2026: శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రెండు రాశుల వారికి జాగ్రత్త అవసరం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు