Kangana Ranaut : బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న Kangana Ranaut గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె, ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.
తెలుగులో Prabhas సరసన Ek Niranjan సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కంగనా. అయితే కొంతకాలంగా ఆమె వెండితెరకు దూరంగా ఉంటోంది. చివరగా Emergency తర్వాత మరో సినిమాలో ఆమె కనిపించలేదు.
సినిమాలకంటే ఇప్పుడు రాజకీయాల్లోనే ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్న కంగనా, Bharatiya Janata Partyలో చేరి హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా ఎన్నికైంది. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలిగా బిజీగా ఉంటోంది.
ఇలాంటి సమయంలో కంగనాకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత Karan Johar ఆమెను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాడు.
“మీరు ఎప్పుడైనా ఎవరికైనా సరసాలాడటానికి ప్రయత్నించారా?” అని కరణ్ అడగ్గా, కంగనా ఏమాత్రం ఆలోచించకుండా “అవును” అంటూ Akshaye Khanna పేరును వెల్లడించింది.
“నేను మొదట అక్షయ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆ తర్వాత అతడ్ని నిజంగానే పడేయాలని ట్రై చేశాను. కానీ అతను నాతో అసలు మాట్లాడలేదు. నాతోనే కాదు, అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు” అని చెప్పుకొచ్చింది.
కంగనా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అక్షయ్ ఖన్నా విషయానికి వస్తే, ఇటీవల ఆయన నటించిన Dhurandhar సినిమాలోని రెహ్మాన్ డెకాయిత్ పాత్రకు మంచి ప్రశంసలు అందాయి. అలాగే అంతకు ముందు Chhaava సినిమాలో ఔరంగజేబు పాత్రలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఇవీ చదవండి: Kangana Sharma : గ్లామర్ షో, బోల్డ్ లుక్స్, ఆత్మవిశ్వాసం.. కేరాఫ్ కంగన శర్మ
Tollywood : ఒకప్పుడు గ్లామర్‌తో ఊపేసింది.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఈ భామ ఎవరో తెలుసా?
