Tollywood : ఒకప్పుడు తెలుగులో మెరుపు తీగలా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. వారిలో ఒకరు ఈ అందాల తార. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించిన ఈ భామ.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఉన్నట్టుండి సినిమాలకు గుడ్‌బై చెప్పి అందరినీ షాక్‌కు గురిచేసింది. తాజాగా ఆమె లుక్ చూసి “ఇది అదే హీరోయిన్‌నా?” అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
తెలుగులో నాగార్జున, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ లాంటి హీరోలతో నటించిన ఆమె.. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాల్లోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే పెళ్లికి ముందే సినిమాల నుంచి తప్పుకోవడం, సోషల్ మీడియాలోని సినిమా ఫోటోలు–వీడియోలు డిలీట్ చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు—సనా ఖాన్.
ముంబైకి చెందిన సనా ఖాన్ కెరీర్ ఆరంభంలో పలు హిందీ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించింది. తెలుగులో కత్తి (కల్యాణ్ రామ్)తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత గగనంలో నాగార్జున సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మంచు మనోజ్‌తో కలిసి మిస్టర్ నూకయ్యలోనూ కనిపించింది. తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది.
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న సనా ఖాన్.. 2019లో విశాల్ నటించిన అయోగ్యతో చివరిసారిగా తెరపై కనిపించింది. ఆ తర్వాత అనూహ్యంగా సినిమాలన్నింటికీ దూరమైంది.
అనంతరం దుబాయ్‌కు చెందిన అనస్ సయ్యద్‌తో నిఖా చేసుకున్న సనా ఖాన్.. పెళ్లి తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు సయ్యద్ తారిఖ్ జమీల్ అనే కుమారుడు ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీ, ఆధ్యాత్మిక యాత్రల ఫోటోలను షేర్ చేస్తోంది. తాజాగా ఆమె ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
గ్లామర్ ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు సనా ఖాన్ చేసిన ఈ ప్రయాణం ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యమేనని చెప్పాలి.
ఇవీ చదవండి: Serial Actress : సీరియల్‌లో సాదాసీదాగా.. సోషల్ మీడియాలో మాత్రం హాట్‌గా లాస్య గ్లామర్ షో!
Kangana Sharma : గ్లామర్ షో, బోల్డ్ లుక్స్, ఆత్మవిశ్వాసం.. కేరాఫ్ కంగన శర్మ
