OTT Movie: ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్స్ 2026 నామినేషన్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించబడిన విషయం తెలిసిందే. ఈసారి భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం నామినేషన్స్ జాబితాలో చోటు దక్కించుకోలేక నిరాశ మిగిల్చింది. అయితే అదే సమయంలో ఓ హాలీవుడ్ సినిమా మాత్రం రికార్డు స్థాయిలో 16 ఆస్కార్ నామినేషన్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం సోషల్ మీడియా నుంచి సినీ వర్గాల వరకు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో కొనసాగుతోంది.
బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు
ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. సుమారు $90 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా $368 మిలియన్‌కు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. భారీ ఓపెనింగ్స్‌తో పాటు లాంగ్ రన్‌లోనూ సినిమా తన సత్తా చాటింది.
గతేడాది చివర్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ మూవీకి అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం కూడా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఈ సినిమాను వీక్షిస్తూ ట్రెండింగ్‌లో నిలబెడుతున్నారు.
కథ ఏంటి అంటే…
ఈ సినిమా కథ 1932లోని మిసిసిపీ డెల్టా ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. ఆ కాలంలో జాతి వివక్ష తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కథ ముందుకు సాగుతుంది.
ఎలిజా స్మోక్ మూర్, ఎలియాస్ స్టాక్ మూర్ అనే ట్విన్ బ్రదర్స్ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న తర్వాత చికాగోకు వెళ్తారు. అక్కడ అక్రమ వ్యాపారాల ద్వారా భారీగా సంపాదించి తిరిగి తమ స్వగ్రామానికి వస్తారు.
గతాన్ని మరిచి ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతో ఊరి బయట ఉన్న ఒక పాత మిల్‌ను కొనుగోలు చేసి దాన్ని మ్యూజిక్ క్లబ్‌గా మార్చుకుంటారు. అయితే ఆ క్లబ్‌లో వినిపించే సంగీతమే ఊహించని ప్రమాదానికి కారణమవుతుంది.
ఒక రాత్రి ఆ మ్యూజిక్ ప్రభావంతో అత్యంత క్రూరమైన వ్యాంపైర్లు బయటికొస్తారు. మరోవైపు సమాజంలో వేళ్లూనుకున్న జాతి వివక్ష కూడా వారి జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది. ఈ రెండు ప్రమాదాల నుంచి సోదరులు ఎలా తప్పించుకున్నారు? ఊరి ప్రజలను ఎలా రక్షించారన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
టెక్నికల్ టీమ్ & నటీనటులు
ఈ హై ఇంటెన్సిటీ హారర్ థ్రిల్లర్ మూవీకి వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సంస్థగా వ్యవహరించింది.
దర్శకత్వం వహించింది ర్యాన్ కూగ్లర్.
ట్విన్ బ్రదర్స్ పాత్రల్లో మైఖేల్ బి. జోర్డాన్ అద్భుతమైన నటనతో మెప్పించారు.
అలాగే హైలీ స్టెయిన్‌ఫెల్డ్, మైల్స్ కాటన్, జాక్ ఓ’కానెల్, వున్మి మొసాకు, జేమ్ లాసన్, ఒమర్ మిల్లర్, డెల్రాయ్ లిండో తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఎక్కడ చూడొచ్చు?
ప్రస్తుతం ఈ సంచలన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫార్మ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్, థ్రిల్లర్, హిస్టారికల్ డ్రామా మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మిస్ కాకూడదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి: The Raja Saab Movie review : రాజా సాబ్ మూవీ రివ్యూ.. ప్రభాస్ హారర్-కామెడీలో ఉతికేశాడు.. ఓవరాల్ గా ఎలా ఉంది?
OTT Movie : రివెంజ్ ఫర్ లవ్.. ఓటీటీలో అదరగొడుతున్న హారర్ థ్రిల్లర్!
OTT Cinema: వీడియో కాల్‌తో మొదలైన ప్రేమ.. చివరకు థ్రిల్లింగ్ ట్విస్ట్.. ఓటీటీలోకి వస్తున్న సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ
