OTT Cinema: ఓటీటీ ప్రేక్షకులకు మరో ఇంటెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్ ఎంట్రీ ఇవ్వబోతోంది. థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న ఓ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా పేరు Beauty. ఇప్పటికే ఐఎండీబీలో 8.8 రేటింగ్ సాధించిన ఈ మూవీ, జనవరి 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రాన్ని మారుతి నిర్మించగా, దర్శకత్వం వహించింది ఆర్వీ సుబ్రహ్మాణ్యం. తాజాగా థియేటర్ల నుంచి ఓటీటీకి వస్తుండటంతో ఈ సినిమాపై మరోసారి ఆసక్తి పెరిగింది.
ప్రధాన పాత్రల్లో ఎవరు?
ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో
అంకిత్ కొయ్య
నీలఖి
నరేష్
వాసుకీ
కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో నరేష్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది.
కథేంటంటే…
నారాయణ (నరేష్) ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్. అతడి ప్రపంచమంతా తన కూతురు అలేఖ్య (నీలఖి) చుట్టూనే తిరుగుతుంది. ఆమె ఇంటర్ చదువుతుండగా, అనుకోకుండా పెట్ ట్రైనర్ అర్జున్ (అంకిత్ కొయ్య)తో పరిచయం ఏర్పడుతుంది. కాలక్రమంలో అది ప్రేమగా మారుతుంది.
ఒకరోజు అలేఖ్య తన ప్రియుడితో అసభ్యకరమైన వీడియో కాల్ మాట్లాడుతుండటం తల్లి వాసుకీకి తెలిసిపోతుంది. ఆగ్రహంతో కూతురిపై చేయి చేసుకోవడంతో అలేఖ్య ఇంటి నుంచి పారిపోయి అర్జున్‌తో కలిసి వెళ్లిపోతుంది. కూతురు కోసం తండ్రి నారాయణ హైదరాబాద్ బయలుదేరుతాడు.
అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ప్రేమ జంటకు ఎదురయ్యే అనూహ్య పరిస్థితులు ఏమిటి? అమ్మాయిలను వేధించే ముఠా వారి జీవితాన్ని ఎలా మార్చింది? చివరకు తండ్రి తన కూతురిని కలుసుకున్నాడా లేదా? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
ఎందుకు చూడాలి?
ప్రేమ పేరుతో తప్పుదారి పట్టిన యువత, ఆ తర్వాత ఎదురయ్యే ప్రమాదాలు, కూతురిని ప్రాణంగా ప్రేమించే తండ్రి పడే మానసిక వేదన—ఈ అంశాలన్నీ సినిమాను భావోద్వేగంగా మలుస్తాయి. మిడిల్ క్లాస్ కుటుంబాల ఆలోచనలకు దగ్గరగా ఉండే కథ కావడంతో ఈ సినిమా ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవుతుంది.
ప్రత్యేకంగా నరేష్ నటన మరోసారి హృదయాలను తాకుతుంది. రొమాన్స్‌తో పాటు థ్రిల్, ఎమోషన్ కలగలిపిన ఈ సినిమా ఓటీటీలో చూడదగ్గ లిస్ట్‌లో ఖచ్చితంగా చేరుతుంది.
ఇవీ చదవండి: OTT Movie: క్రిస్మస్ కానుక.. ఓటీటీలోకి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ – స్ట్రీమింగ్ ఎక్కడవుతోంది?
Cinema : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న భయానక సినిమా.. రాత్రి ఒంటరిగా చూస్తే గుండె ఆగినట్టే!
