HomeCinemaOTT Movie : రివెంజ్ ఫర్ లవ్.. ఓటీటీలో అదరగొడుతున్న హారర్ థ్రిల్లర్!

OTT Movie : రివెంజ్ ఫర్ లవ్.. ఓటీటీలో అదరగొడుతున్న హారర్ థ్రిల్లర్!

OTT Movie : సాధారణంగా థియేటర్లలో పెద్దగా కలెక్షన్లు సాధించని కొన్ని సినిమాలు, ఓటీటీలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటాయి. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్, క్రైమ్, సస్పెన్స్ జానర్‌లో వస్తే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. తాజాగా అలాంటి ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను గట్టిగా భయపెడుతోంది. (OTT Movie)

ఈ సినిమా కథ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న ఒక బిల్డింగ్ నేపథ్యంలో సాగుతుంది. అక్కడ నైట్‌ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు సుశాంత్. ఒక రోజు రాత్రి అతనికి వింత శబ్దాలు వినిపిస్తాయి. ఎవరైనా తనను గమనిస్తున్నారన్న అనుమానం కలుగుతుంది. దీంతో డాక్టర్ సామ్‌ను సంప్రదించి, ఇద్దరూ కలిసి ఆ బిల్డింగ్‌లోని రహస్యాన్ని చేధించడానికి వెళ్తారు. కానీ అనుకోని పరిణామాలు వారిని వెంబడిస్తాయి.

ఆ బిల్డింగ్‌లోని ల్యాబ్‌లో అనేక అమ్మాయిల అస్థిపంజరాలు బయటపడతాయి. ఒక ప్రతీకార ఆత్మ సామ్‌ను ఆవహిస్తుంది. సుశాంత్ ఆ ఆత్మ వెనుకున్న నిజాన్ని, బిల్డింగ్ గతాన్ని తెలుసుకుంటాడు. చివరికి ఆ ఆత్మకు న్యాయం చేయడానికి అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? సామ్ ఆ శక్తి నుండి బయటపడతాడా? అనేది క్లైమాక్స్‌లో అద్భుతంగా చూపించారు.

‘గార్డ్: రివెంజ్ ఫర్ లవ్’ పేరుతో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్‌లో నిజామాబాద్‌కి చెందిన విరాజ్ రెడ్డి హీరోగా నటించాడు. మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సుమారు రెండు గంటల నిడివి గల ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 7.3/10 రేటింగ్ పొందిన ఈ చిత్రం, త్వరలోనే మరో రెండు ఓటీటీల్లో కూడా అందుబాటులోకి రానుంది.

సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘గార్డ్’ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఇవీ చదవండి: OTT Cinema : ఇదేం సినిమా బాబోయ్.. యాక్షన్, సస్పెన్స్, ట్విస్టులు ఓటీటీలో!
OTT Movie : క్రైమ్ థ్రిల్లర్: 9 హత్యలు, హింట్లు వదిలే సైకో కిల్లర్ కథ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు