NPCIL Jobs 2026: ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. Nuclear Power Corporation of India Limited (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 114 పోస్టులను భర్తీ చేయనున్నారు.
సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ, ఎక్స్‌రే టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్–1 వంటి ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. జనవరి 15, 2026 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుండగా, ఫిబ్రవరి 4, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.
పోస్టుల వివరాలు
సైంటిఫిక్ అసిస్టెంట్ / B (సివిల్) – 2 పోస్టులు
స్టైపెండరీ ట్రైనీ / టెక్నీషియన్ – 95 పోస్టులు
ఎక్స్‌రే టెక్నీషియన్ – 2 పోస్టులు
అసిస్టెంట్ గ్రేడ్–1 – 15 పోస్టులు
ఈ ఖాళీలు సివిల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, హెల్త్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ప్లాంట్ ఆపరేటర్, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ వంటి విభాగాల్లో ఉన్నాయి.
అర్హతలు
సంబంధిత విభాగంలో ఇంటర్ / ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సంబంధిత పని అనుభవం ఉండాలి
వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాలు (ఫిబ్రవరి 4, 2026 నాటికి)
దరఖాస్తు ఫీజు
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్: రూ.150
ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
ఈ రెండింటి ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
జీతభత్యాలు
సైంటిఫిక్ అసిస్టెంట్: రూ.55,932/నెల
టెక్నీషియన్: రూ.34,286/నెల
ఎక్స్‌రే టెక్నీషియన్: రూ.40,290/నెల
అసిస్టెంట్ గ్రేడ్–1: రూ.40,290/నెల
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే యువతకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.
ఇవీ చదవండి: RBI Bank Jobs 2025: నెలకు రూ.6 లక్షల వరకు జీతం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్స్‌పర్ట్స్ ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు
Richa Ghosh: డ్యూటీపై రిచా ఘోష్! డీఎస్పీగా బాధ్యతల స్వీకరణ – జీతం & బోనస్ వివరాలు ఇవే
LIC AAO Jobs 2025: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో భారీ ఉద్యోగాలు.. జీతం లక్ష!
