RBI Bank Jobs 2025: దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కార్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎక్స్‌పర్ట్స్ పోస్టుల భర్తీకి RBI నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 93 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 17 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకాలకు రాత పరీక్ష లేకుండానే ఎంపిక ప్రక్రియ జరగనుండడం విశేషం. విద్యార్హతలు, పని అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు
1. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (DIT) – 22 పోస్టులు
డేటా సైంటిస్ట్ – 2
ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ – 7
ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ – 5
ఏఐ / ఎంఎల్ స్పెషలిస్ట్ – 3
ఐటీ – సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ – 5
2. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సూపర్‌విజన్ (DoS) – 66 పోస్టులు
మార్కెట్ & లిక్విడిటీ రిస్క్ స్పెషలిస్ట్ – 11
ఐటీ – సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ – 13
ఆపరేషనల్ రిస్క్ అనలిస్ట్ – 2
రిస్క్ అనలిస్ట్ – 5
బిజినెస్ & ఫైనాన్షియల్ రిస్క్ అనలిస్ట్ – 6
డేటా సైంటిస్ట్ – 4
3. ప్రిమైసెస్ డిపార్ట్‌మెంట్ – 5 పోస్టులు
ప్రాజెక్ట్ మేనేజర్
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో
BBA, BSc, BTech/BE, LLB, CA, LLM, MSc, ME/MTech, MBA/PGDM, MCA, PGDBA వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సంబంధిత పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 21 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం
ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
ఓబీసీలకు – 3 సంవత్సరాలు
పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు – 10 సంవత్సరాల వరకు
వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం & ఫీజు
అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 6, 2026 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు – రూ.600
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు – రూ.100
దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
ఎంపిక విధానం & జీతం
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా విద్యార్హతలు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3,10,000 నుంచి రూ.6,00,000 వరకు జీతం చెల్లిస్తారు.
ఇవీ చదవండి: Bank of Baroda Jobs 2025: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్ – అర్హతలు ఉంటే జాబ్ గ్యారెంటీ
TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ జాబ్స్ సాధించిన వారికి సర్కారు ఝలక్..!
