HomeAndhra PradeshGold Price Today: పసిడి పరుగులకు బ్రేక్.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Gold Price Today: పసిడి పరుగులకు బ్రేక్.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Gold Price Today: ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు వంటి అంశాలు విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాలతోనే బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నట్లు విశ్లేషిస్తున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టడం పసిడి ప్రియులకు ఊరటనిచ్చే అంశం. గుడ్‌రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం..

సోమవారం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు తులం బంగారం ధర రూ.1,520 తగ్గగా,
మంగళవారం నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మరో రూ.100 తగ్గింది.
దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో
24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,33,850,
22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,22,690గా కొనసాగుతోంది.

వెండి ధరలకూ స్వల్ప తగ్గుదల
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. మంగళవారం కేజీ వెండి ధర రూ.1,99,200 వద్ద ఉండగా, బుధవారం ఉదయం 6 గంటల నాటికి రూ.100 తగ్గి రూ.1,99,100కు చేరింది. దీంతో వెండి కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు)
ఢిల్లీ
24 క్యారెట్లు: ₹1,34,000
22 క్యారెట్లు: ₹1,22,840

ముంబై
24 క్యారెట్లు: ₹1,33,850
22 క్యారెట్లు: ₹1,22,690

హైదరాబాద్
24 క్యారెట్లు: ₹1,33,850
22 క్యారెట్లు: ₹1,22,690

విజయవాడ
24 క్యారెట్లు: ₹1,33,850
22 క్యారెట్లు: ₹1,22,690

చెన్నై
24 క్యారెట్లు: ₹1,34,720
22 క్యారెట్లు: ₹1,23,490

బెంగళూరు
24 క్యారెట్లు: ₹1,33,850
22 క్యారెట్లు: ₹1,22,690

ఇది గుర్తుంచుకోండి
ఈ ధరలు బుధవారం ఉదయం 6 గంటల వరకు నమోదైనవి మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ మారకం విలువ, ఫెడ్ పాలసీల ప్రభావంతో బంగారం–వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మంచిది.

ఇవీ చదవండి: Gold Rate Today: మళ్లీ ఎగబాకుతున్న బంగారం ధరలు… తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే
Bank of England : బంగారం కింద దాగి ఉన్న లండన్ వీధి రహస్యం.. రోజూ టన్నుల బంగారంపై కార్లు, బస్సులు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు