Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ పెరుగుదల మార్గంలో పయనిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం లక్షా 30 వేల మార్క్ దాటి పరుగులు పెట్టిన పసిడి ధరలు ఆ తర్వాత కొంతవరకు తగ్గినా… ఇప్పుడు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతోంది అని బులియన్ నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక మార్పులు, జియో పొలిటికల్ పరిస్థితులు బంగారం–వెండి ధరలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఒక రోజు ధర పెరగగా… మరో రోజు తగ్గడం సాధారణమని నిపుణుల అభిప్రాయం.
ఇక తాజాగా, బుధవారం (నవంబర్ 26, 2025) ఉదయం 6 గంటల వరకు నమోదైన రేట్ల ప్రకారం భారతదేశంలో గోల్డ్–సిల్వర్ ధరలు స్వల్పంగా పెరిగాయి.
దేశీయ మార్కెట్‌లో తాజా బంగారం–వెండి ధరలు
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) – రూ.1,27,050 (₹10 పెరుగుదల)
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) – రూ.1,16,460 (₹10 పెరుగుదల)
వెండి (1 కిలో) – రూ.1,67,100 (₹100 పెరిగింది)
తెలుగు రాష్ట్రాలు & మెట్రో నగరాల్లో రేట్లు
హైదరాబాద్
24K: ₹1,27,050
22K: ₹1,16,460
సిల్వర్ కిలో: ₹1,74,100
విజయవాడ & విశాఖపట్నం
24K: ₹1,27,050
22K: ₹1,16,460
సిల్వర్ కిలో: ₹1,74,100
ఢిల్లీ
24K: ₹1,27,200
22K: ₹1,16,610
సిల్వర్ కిలో: ₹1,67,100
ముంబై
24K: ₹1,27,050
22K: ₹1,16,460
సిల్వర్ కిలో: ₹1,67,100
చెన్నై
24K: ₹1,27,870
22K: ₹1,17,210
సిల్వర్ కిలో: ₹1,74,100
బెంగళూరు
24K: ₹1,27,050
22K: ₹1,16,460
సిల్వర్ కిలో: ₹1,67,100
ఎందుకు నగరాలవారీగా ధరలు మారుతాయి?
బంగారం–వెండి ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు.
వాటి మార్పుకు కారణాలు:
స్థానిక డిమాండ్ & సరఫరా
హాల్‌మార్క్ ఛార్జీలు
రాష్ట్ర పన్నులు
మార్కెట్ ప్రీమియం
అందుకే ప్రతి నగరంలో రేట్లలో చిన్న–పెద్ద వ్యత్యాసాలు కనిపిస్తాయి.
లేటెస్ట్ గోల్డ్ రేట్ తెలుసుకోవాలంటే…
బంగారం–వెండి తాజా ధరల కోసం 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
ఇవీ చదవండి: Gold Price Update: గోల్డ్ లవర్స్‌కి దిబ్బర గుడ్ న్యూస్ – మరోసారి తగ్గిన బంగారం ధరలు!
Bank of England : బంగారం కింద దాగి ఉన్న లండన్ వీధి రహస్యం.. రోజూ టన్నుల బంగారంపై కార్లు, బస్సులు!
