HomeAndhra PradeshMedical Seats in AP: పీజీ మెడికల్ విద్యలో ఏపీకి అదనంగా 36 సీట్లు మంజూరు

Medical Seats in AP: పీజీ మెడికల్ విద్యలో ఏపీకి అదనంగా 36 సీట్లు మంజూరు

Medical Seats in AP: ఆంధ్రప్రదేశ్‌లో పీజీ వైద్య విద్యకు సంబంధించి మరో శుభవార్త వచ్చింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ మెడికల్ కోర్సులకు అదనంగా 36 సీట్లను జాతీయ వైద్య కమిషన్ (NMC) మంజూరు చేసింది. ఇప్పటికే తొలివిడతలో 60 సీట్లు అనుమతి లభించగా, తాజా మంజూరుతో మొత్తం సీట్ల సంఖ్య 96కు చేరింది.

మరిన్ని పీజీ సీట్ల సాధన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అవసరమైన బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టడంతో పాటు, కళాశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) అధికారుల సూచనల మేరకు ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల, విజయనగరం, మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎన్ఎంసీకి ప్రతిపాదనలు పంపారు.

ఈ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా పీజీ వైద్య విద్యలో
ఏలూరు వైద్య కళాశాలకి – 12 సీట్లు,
రాజమహేంద్రవరం – 4 సీట్లు,
మచిలీపట్నం – 8 సీట్లు,
నంద్యాల – 4 సీట్లు,
విజయనగరం – 8 సీట్లు
మంజూరైనట్లు డీఎంఈ డాక్టర్ రఘనందన్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

తొలివిడతలో వచ్చిన 60 సీట్లకు తాజా 36 సీట్లు కలవడంతో, రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మొత్తం 96 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈ నిర్ణయంతో ఏపీలో వైద్య విద్యార్థులకు పీజీ అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.

ఇవీ చదవండి: YSRCP : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ పోరు.. కోటి సంతకాలతో భారీ ర్యాలీలు.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
YS Jagan on Medical Colleges : మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం : జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు