UPSC NDA NA 2026 Notification: భారత త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (NDA & NA) (1) – 2026 నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 394 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పురుషులకు 370, మహిళలకు 24 పోస్టులు కేటాయించారు. అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 30, 2025 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా NDA, ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
ఆర్మీ: 208 పోస్టులు
పురుషులు: 198
మహిళలు: 10
నేవీ: 42 పోస్టులు
పురుషులు: 37
మహిళలు: 5
ఎయిర్ ఫోర్స్ (ఫ్లయింగ్ బ్రాంచ్): 92 పోస్టులు
పురుషులు: 90
మహిళలు: 2
గ్రౌండ్ డ్యూటీస్ (టెక్నికల్): 18 పోస్టులు
పురుషులు: 16
మహిళలు: 2
గ్రౌండ్ డ్యూటీస్ (నాన్-టెక్నికల్): 10 పోస్టులు
పురుషులు: 8
మహిళలు: 2
నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 24 పోస్టులు
పురుషులు: 21
మహిళలు: 3
అర్హతలు (Eligibility Criteria)
పోస్టులను అనుసరించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి
ఎత్తు
పురుషులు: కనీసం 157 సెం.మీ
మహిళలు: కనీసం 152 సెం.మీ
వయోపరిమితి:
16½ నుంచి 19½ సంవత్సరాల మధ్య
2007 జూలై 1కు ముందు, 2010 జూలై 1 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు
దరఖాస్తు వివరాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: డిసెంబర్ 30, 2025
దరఖాస్తు ఫీజు:
జనరల్ / ఓబీసీ అభ్యర్థులు: రూ.100
SC / ST / మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు
ఎంపిక విధానం & జీతభత్యాలు
రాత పరీక్ష + SSB ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో
నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు
రాత పరీక్ష విధానం
మ్యాథమెటిక్స్: 300 మార్కులు
జనరల్ ఎబిలిటీ టెస్ట్ (GAT): 600 మార్కులు
మొత్తం మార్కులు: 900
ప్రశ్నలు: ఆబ్జెక్టివ్ టైప్
నెగటివ్ మార్కింగ్ ఉంటుంది
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి SSB టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్ ఉంటాయి. ఇది కూడా 900 మార్కులకు నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ 12, 2026
రాత పరీక్ష ఫలితాలు: మే 2026
SSB ఇంటర్వ్యూలు: జూన్ – జూలై 2026
NDA 157వ కోర్సు ప్రారంభం: జనవరి 1, 2027
NA 119వ కోర్సు ప్రారంభం: జనవరి 1, 2027
ఇవీ చదవండి: APPSC Exam Schedule 2026: ఏపీపీఎస్సీ విడుదల చేసిన 21 నోటిఫికేషన్‌లకు పరీక్షల పూర్తి షెడ్యూల్
WPL 2026 Full Schedule: ఈ సారి షెడ్యూల్‌లో భారీ ట్విస్ట్ – సెలవు రోజున కాదు, వర్కింగ్ డేలోనే ఫైనల్!
