HomeTelanganaKCR: మంచిరోజులు తప్పకుండా వస్తాయి.. గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించండి

KCR: మంచిరోజులు తప్పకుండా వస్తాయి.. గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించండి

KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మరోసారి పార్టీ cadreకి ధైర్యం చెప్పారు. ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా తనను కలిసి మాట్లాడిన సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్ని రోజులు ఒకేలా ఉండవని, కొన్ని కఠిన పరిస్థితులు వచ్చినా ప్రజలు అధైర్యపడకూడదని, త్వరలోనే తిరిగి మంచిరోజులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు.

గ్రామాభివృద్ధిలో బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శం
తెలంగాణలో బీఆర్ఎస్ పాలన కాలంలో గ్రామాలు స్వయం సమృద్ధి దిశగా సాగాయని కేసీఆర్ పేర్కొన్నారు.
పల్లె ప్రగతి, పంచాయతీరాజ్ బలోపేతానికి తాము చేపట్టిన పథకాలు, ఆర్థిక సహకారం గ్రామీణాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయని గుర్తుచేశారు.

ప్రజలు ధైర్యం కోల్పోవద్దు – కేసీఆర్ సూచనలు
కష్టాలు వచ్చినప్పుడు వెనుకడుగు వేయకుండా గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తిని తీసుకుని పల్లెలను మరింత అభివృద్ధి చేసుకోవాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.

సర్పంచులకోసం కేసీఆర్ సూచనలు
▪️ గొప్ప ఆలోచనలతో గ్రామాభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని
▪️ గంగదేవిపల్లి వంటి స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలని
▪️ ఎవరైనా చేసి పెడతారని ఎదురు చూడకుండా, స్వయంగా ముందుకు వచ్చి పని చేయాలని కేసీఆర్ సూచించారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తుల ఉదాహరణలను కూడా సర్పంచులకు వివరించారు.

ఇవీ చదవండి: Kavitha Comments : కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు
Koppula Eshwar: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్? కేసీఆర్‌ నుంచి కీలక సమాచారం..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు