HomeTelanganaKavitha Comments : కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha Comments : కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha Comments : భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR)కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) రాసినట్లు చెబుతున్న 6 పేజీల లేఖ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖపై తాజాగా కవిత మాట్లాడారు. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడు.. కానీ, కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయంటూ వ్యాఖ్యానించారు. అలాంటివాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతుందని కామెంట్ చేశారు. అంతరంగికంగా కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతం కావడం బట్టి పార్టీలో ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలని కామెంట్ చేశారు. ఇలాంటి విషయాలు అందరూ ఆలోచించాలన్నారు.

ఏ విషయమైనా అంతర్గతంగా ఉంచే తాను.. ఈసారి ఇలా మీడియా ముందుకెక్కడం బాధాకరంగా ఉందన్నారు. తన లేఖను చూసుకుని కాంగ్రెస్, బీజేపీ బాగా సంబరపడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ ఆగమైండని సంబరపడుతున్నారని చెప్పారు. కానీ తెలంగాణకు ఆశాదీపం కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందన్నారు. పార్టీలోని చిన్న చిన్న లోపాలను సవరించుకుని, కోవర్టులను పక్కన పెట్టాలని సూచించారు.

ఈ లేఖ బీఆర్ఎస్ పార్టీ ఇటీవలి సిల్వర్ జూబ్లీ సభ నిర్వహణ, నాయకత్వ వైఖరి, రాజకీయ వ్యూహాలపై కవిత వ్యక్తం చేసిన అసంతృప్తిని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు. అయితే, ఈ లేఖ ప్రామాణికతపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయినా.. కవిత స్పష్టం చేయడంతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి.

ఇవీ చదవండి: Kavitha Letter to KCR : కేసీఆర్‌కు కవిత లెటర్.. వాట్ ఈజ్ దిస్ డాడీ?
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. బీఆర్ఎస్ విలీనంపై కాంగ్రెస్, బీజేపీ కొట్లాటేందిరబై..!
MLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు