HomeAgricultureAndhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో పత్తి రైతుల తీవ్ర ఆర్థిక సంక్షోభం

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో పత్తి రైతుల తీవ్ర ఆర్థిక సంక్షోభం

Andhra Pradesh : అతివృష్టి వలన దిగుబడులు గణనీయంగా తగ్గి, అమ్మకం ధర లేక రైతులకు ఆంధ్రప్రదేశ్ లో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ కార్మికులకు పని తగ్గి కర్నూలు జిల్లా నుండి వలసలు మొదలయ్యాయని వ్యవసాయ రంగ నిపుణుడు, వైయస్సార్ సీపీ సీనియర్ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కాన్నారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరవడం, నాణ్యత సమస్యలు, దిగుమతుల ఒత్తిడి కారణంగా పత్తి రైతుకు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తి రైతుల కష్టాలపై ఆయన విశ్లేషణ.

ఆంధ్రప్రదేశ్‌లో పలు సమస్య ల మధ్య పత్తి సాగుచేసి రైతులు ఆర్థికంగా తీవ్ర ప్రమాదంలో ఉన్నారు. రైతులు అక్టోబర్ నెలలో కురవ వలసిన సాధారణ వర్షం కంటే 84% మోన్థా తుఫాన్ తో కలిపి అధిక వర్షం కురువడం, మూలం గా పూత, పింద రాలిపోయి, కాయలోని పత్తి తడిసిపోయి, కాయలోనే గింజలు మొలకెత్తి దిగుబడి గణ నీయంగా తగ్గి పోయి, వచ్చిన ఉత్పత్తిని కూడా తగిన ధరకి విక్రయించలేక, భారీ నష్టం చెందుతున్నారు. ఈ పరిస్థితిని ప్రభుత్వ యంత్రాంగం పట్టించు కోక పోవడం గ్రామీణ జీవనానికి తీవ్ర ముప్పను ఏర్పరుస్తున్నది..

*బహుశా గత 20 సంవత్సరాలలో లేనంతటి సంక్షోభం ఈ సంవత్సరం పత్తి రైతులు ఎదుర్కొంటున్నారు*..

*ముఖ్య అంశాలు*
ఈ సీజన్‌లో రాష్ట్రం లో పత్తి సాగు విస్తీర్ణం 11.26 లక్ష ఎకరాలు గా ఉంది.
దరి దాపుగా సాగు అంతా వెనుక బడిన జిల్లాలలోనే..

ఇందులో అత్యధికం గా ఒక్క కర్నూల్ జిల్లాలోనే 5.58 (50%) లక్షల ఎకరాలు లు, పల్నాడు జిల్లా లో 2.24 (20%)లక్షల ఎకరాలు, NTR జిల్లాలో 82 వేల ఎకరాలు, అనంతపురం జిల్లా లో 67 వేల ఎకరాలు, గుంటూరు జిల్లా లో 59 వేల ఎకరాలు, ప్రకాశం జిల్లలో 46 వేల ఎకరాలు, పార్వతీపురం మన్యం 16 వేల ఎకరాలు, వై యస్ ఆర్ కడప 15 వేల ఎకరాలు, నంద్యాల 14 వేల ఎకరాలు, సత్య సాయి 9.5 వేల ఎకరాలు, అల్లూరి సీతా రామ రాజు జిల్లా 9 వేల ఎకరాలు..

CCI కొనుగోలు కేంద్రాల ఆలశ్య ప్రారంభం, ప్రారంభమైన తరువాత కూడా నిబంధనలు కఠినంగా ఉండడం, నాణ్యత ప్రమాణాలు చేరలేదు అనే నెపం తో రైతుల దగ్గర భారీ నష్టాలు కలిగిస్తున్నాయి.

రైతులు క్వింటాలు 4,000–7,200 రూపాయల మధ్య న తమ పత్తిని ప్రైవేట్ వ్యాపారులకే అమ్మాల్సి వస్తున్నది, సరాసరిన 5,000 నుండి 6,000 రూపాయలు మాత్రమే రైతుకు వస్తున్న దుస్థితి. ఇది ప్రభుత్వం నిర్ణయించిన MSP 8110 రూపాయల కంటే 25% పైగా తక్కువ..

తేమ 12% పైగా ఉంది అనే నెపం తో పత్తి తక్కువ ధరకు కొనుగోలు చేయబడుతున్నది. రైతులకు తగిన ఏర్పాట్లు లేకపోవటం ఇది ఒక పెద్ద సమస్యగా మారింది..

ఇప్పటి వరకూ రాష్ట్రం మొత్తం మీద సి సి ఐ ద్వారా ఎంత ప్రత్తి కొనుగోలు చేశారో అధికారికంగా ప్రకటన విడుదల చేయండి !!!

దిగుమతులపై రుసుముల తొలగింపు నిర్ణయం ద్వారా విదేశీ పత్తి ప్రవేశం పెరిగి స్థానిక రైతుల ధరలపై ప్రతికూల ప్రభావం..

డిమాండ్లు..
1. వెంటనే ప్రత్తి కొనుగోలు కేంద్రాలద్వారా
రైతులకు కనీస
మద్దత్తు ధర
లభించేలా చూడాలి..

2. CCI తేమ పరిమితిని సడలించాలి (ఉదా: వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని)..

3. నాణ్యత ప్రమాణాలు సాధ్యమైన విధంగా సరళీకృతమైన ప్రమాణాలకు మార్చాలి..

4. ఆర్థిక సహాయంగా ఇన్ పుట్ సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం మే అప్రకటితంగా ఉచిత భీమా పథకం ఎత్తి వేసి నందున భీమా ప్రకారం రైతులకు ఈ సంవత్సరం ఎంత పరిహారం వస్తుందో ఆ ప్రకారం ప్రత్తి రైతు లందరికి
బీమా పరిహారం
రాష్ట్ర ప్రభుత్వ మే
వెంటనే చెల్లించాలి..

*పత్తి రైతుల తీవ్ర సంక్షోభం పై*..వెంటనే ప్రభుత్వం స్పందించాలి..

ప్రభుత్వం, మార్కెట్ సంస్థలు, కలసి సమన్వయంగా పని చేయక పోతే గ్రామీణ ఆర్ధిక స్థితి చాలా ప్రమాదం లో పడనుంది..
కర్నూలు జిల్లా నుండి వలసలు పెరిగే ప్రమాదం ఉంది.

– ఎంవీఎస్ నాగిరెడ్డి,
YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, (వ్యవసాయం, రైతు సంక్షేమం)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ (2019-24),
భారతీయ వ్యవసాయ. పరిశోధనా మండలి సభ్యుడు (2011-14).

ఇవీ చదవండి: Andhra Pradesh : ఖరీఫ్‌లో ఏపీ రైతులకు కష్టం.. అతివృష్టి, అనావృష్టి, ఆర్థిక సంక్షోభం
Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ రెండో విడత.. 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్లు
Kakani Govardhan Reddy : పెట్టుబడి సాయంలో 7 లక్షల మంది రైతులకు మొండిచెయ్యి: మాజీ మంత్రి కాకాణి ఫైర్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు