HomeCinemaIBOMMA : ఐబొమ్మ పడిపోగా… కొత్త బొమ్మ వచ్చేసింది! పైరసీకి కొత్త టెక్ ట్రిక్‌తో రీ-ఎంట్రీ

IBOMMA : ఐబొమ్మ పడిపోగా… కొత్త బొమ్మ వచ్చేసింది! పైరసీకి కొత్త టెక్ ట్రిక్‌తో రీ-ఎంట్రీ

IBOMMA : ఐబొమ్మ వెబ్‌సైట్‌ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. సైట్‌ కూడా తీసివేయబడింది. దీంతో పైరసీ సమస్య సద్దుమణిగిందని చాలామంది భావించారు. కానీ పైరేట్స్ అంత సులభంగా వదిలేయలేదు. ఐబొమ్మ మూసుకుంటే ఇంకో ‘బొమ్మ’ తెరమీదకు తెచ్చేస్తున్నారంటే నమ్మలేనట్టే అనిపిస్తుందేమో… కానీ ఇదే వాస్తవం.

ఐబొమ్మ–బొప్పం సైట్లు బ్లాక్ చేయగానే, పైరసీ క్రిమినల్స్ మరింత తెలివైన మార్గాన్ని ఎంచుకున్నారు. కొత్త వెబ్‌పోర్టల్ సహాయంతో మూవీ లింక్‌లను దాచిపెట్టి చూపించే కొత్త టెక్నిక్‌ను వాడుతున్నారు. బయటికి చూసినప్పుడు సాధారణ వెబ్‌సైట్‌లాగే కనిపించినా, లోపల మాత్రం హైక్వాలిటీ పైరసీ సినిమాలు పరుగులు పెడుతున్నాయి.

పైరేట్స్ కొత్త టెక్నిక్ – లింక్‌ల దాచుడు!
ఇప్పుడు పైరసీ ఇలా జరుగుతోంది:
మొదట బొప్పం/బొప్పం TV లాంటి సైట్ల నుంచి మూవీ లింక్ తీసుకోవాలి.
ఆ లింక్‌ను SBI టర్మ్ ఇన్సూరెన్స్ పేరుతో కనిపించే మరో వెబ్‌సైట్‌లో పేస్ట్ చేస్తే…
వెంటనే మూవీ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది!

ఇది అంతా ఐబొమ్మ & బప్పం పాత టీమ్ కొత్త పేర్లతో తయారు చేసిన ట్రిక్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాసెస్‌ను చూపించే వీడియోలు కూడా ఇప్పటికే వైరల్.

పైరసీ సైట్లు మూతపడినా… వ్యాపారం ఆగదు
ఐబొమ్మ, బప్పం మూతపడినప్పుడే పైరసీ పరిశ్రమ ముగిసిందనుకుంటే పొరపాటే. పైరేట్స్ ఇప్పుడు సైట్లను బ్లాక్ చేయకముందే కొత్త బ్యాకప్ పోర్టల్స్ రెడీగా ఉంచుతున్నారు.
పేర్లు మార్చడం
అద్దపు వెబ్‌సైట్‌లు క్రియేట్ చేయడం
ఇన్సూరెన్స్, టూల్స్, డమ్మీ పేజీల్లో మూవీ లింకులు దాచడం
ఈ పద్ధతులతో పైరసీ నెట్‌వర్క్‌ను కొనసాగిస్తున్నారు.

మళ్లీ నిరూపించారు – పైరసీ స్టాప్ కాదు, రూపం మాత్రమే మారుతుంది
ఇంటర్నెట్‌ ఉన్నంతకాలం పైరసీ పూర్తిగా అంతరించిపోదని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది. చట్టపరమైన చర్యలు తీసుకున్నా, సైట్లు బ్లాక్ చేసినా—పైరేట్స్ కొత్త మార్గాలను వెంటనే కనుగొంటున్నారు.

ఇవీ చదవండి: IBOMMA Ravi : ఇంత చిన్న తప్పిదమేనా? అదే ఐబొమ్మ రవిని పట్టేసింది… విచారణలో ఒక్కొక్కటిగా బయటకు!
I Bomma : ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు – టాలీవుడ్‌ను కుదిపిన పైరసీ మాఫియా భేదాలు
IBOMMA Ravi : పైరసీ కింగ్ జీవితం వెండితెరపైకి.. హీరోనా? విలనా? ఆసక్తికర చర్చ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు