Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 ఖరీఫ్‌లో ఒక వైపు అనావృష్టి, మరో వైపు అతివృష్టితో అన్ని జిల్లాలలో రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని వ్యవసాయ రంగ నిపుణుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని, ఈ క్రమంలోనే అరటి రైతులు కూడా తాజాగా రోడ్డెక్కుతున్నారని ఆయన చెప్పారు. పొలం లోనే రాలిపోతున్న అరటి పండ్లు..దిక్కు తోచని స్థితిలో రైతు ఉన్నాడన్నారు. ఏపీ రైతుల ఆక్రందనపై ఆయన విశ్లేషణ.
ఏమిటీ అన్న దాతల ఆక్రందన!
తీర్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా?
2025-26 ఖరీఫ్ లో రాయలసీమ లో ప్రధానమైన వేరుశనగ సాగు సంక్షోభం, ఉల్లి, సజ్జ, మొక్కజొన్న అమ్మకం సంక్షోభం, ప్రత్తి ఉత్పత్తి+అమ్మకం సంక్షోభం..
మరలా దిక్కు తోచక డిస్ట్రెస్ సేల్ కు అమ్ముకుంటున్న అరటి రైతుల సంక్షోభం
రాయల సీమ హార్టికల్చర్ హబ్. పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిలో అగ్రస్తానం..
రాష్ట్రం మొత్తం అన్ని పండ్ల ఉత్పత్తి 213 లక్షల టన్నులు అయితే ఇందులో అరటి ఒక్కటే 74 లక్షల టన్నులు ఇందులో ప్రధాన ఉత్పత్తి రాయల సీమ జిల్లాలలోనే.. ప్రత్యేకంగా G 9 అరటి ఉత్పత్తి లో ఆర్ధికంగా వెనుకబడిన అనంతపురం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలే అగ్ర స్థానం.
ఈ ఖరీఫ్ లో ఇప్పటికే ఉన్న రైతుల సంక్షోభం చాలదు అన్నట్లు పండ్ల ఉత్పత్తి తో ప్రధానమైన *అరటి* ధరలు క్వింటాలు *200 నుండి 300 రూ* కి పడిపోయినాయి..అయినా కొనేవాళ్ళు లేక పొలం లోనే రాలి పోతున్నాయి.. నెల రోజుల క్రితం నుండి పడిపోయిన అరటి ధర నేడు మరింత పతనమైనది..ప్రభుత్వాని కి పట్టించుకోమని విజ్ఞప్తి చేస్తున్న రైతులు..ఆ వైపు చూడని ప్రభుత్వం..
ఉల్లి రైతు ట్రక్కు లలో ఉల్లిపాయలు పారబోయటం, పొలాల లోనే వదిలివేయటం, ట్రాక్టర్ ల తో పంటను దున్నివేయటం చూసాం.. నేడు అరటి రైతు గెలల లను పారబోయటం, అరటి తోటను ట్రాక్టర్ తో దున్ని వేయటం చూస్తున్నాం..
తాను కష్టపడి ఎంతో పెట్టుబడితో సాగు చేసిన పొలాన్ని..ప్రేమ తో పెంచుకున్న పంట ను ఇలా చేయవలసి రావడం ఎంతో మానసిక క్షోభ..ఈ బాధ రైతు కు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు..ఆ మానసిక క్షోభను అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి..
మన కళ్ల ముందే ఇలాంటి పరిస్థితి జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చెయ్య లేమా???
*అరటి* సాగు ఉత్పత్తి
*అనంతపూర్* 46.9 వే ఎ 13 ల ట
*కడప* 42 వే ఎ 11.5 ల ట
*అన్నమయ్య* 27.2 వే ఎ 7.63 ల ట
*తూ గోదావరి* 26.4వే ఎ 7.18 ల ట
*కోనసీమ* 24.5 వే ఎ 6.63 ల ట
*మన్యం* 17.8 వే ఎ 4.8 ల ట
*నంద్యాల* 17 వే ఎ 4.6 ల ట
*సత్య సాయి* 7.7 వే ఎ 2.1 ల ట *విజయనగరం* 7.2 వే ఎ 1.9 ల ట
(ల ఎ=లక్షల ఎకరాలు, ల ట=లక్షల టన్నులు)
ఇన్ని జిల్లా లలో ప్రధానం గా సాగు జరుగుతూ అనేక రాష్ట్రాలకు ప్రత్యేకంగా దేశ రాజ దానికి ఎంతో ఆరోగ్య కరమైన పండు అందిస్తూ పెట్టు బడి కూడా రాని ధర కు అమ్ముకుంటూ మానసిక సంఘర్షణకు గురి అవుతున్న రైతుల దుస్థితి..
అరటి సాగు కు పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పంట పండిస్తే అమ్ముకోలేని పరిస్థితి..
అనంతపురం నుండి శ్రీకాకుళం వరకూ ప్రతి రైతు సంక్షోభమే..
*ప్రకటనలకే పరిమితం తప్ప..ఇంత వరకూ ఏ పంట రైతు నైనా ఆదుకున్నది ఎంత???*
– ఎంవీఎస్ నాగిరెడ్డి,
YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ (2019-24).
ఇవీ చదవండి: Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ రెండో విడత.. 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్లు
YSRCP Annadata Poru : అన్నదాత పోరును అడ్డుకోవడం దారుణం
Kakani Govardhan Reddy : పెట్టుబడి సాయంలో 7 లక్షల మంది రైతులకు మొండిచెయ్యి: మాజీ మంత్రి కాకాణి ఫైర్
