HomeAndhra PradeshAndhra Pradesh : చిత్తూరులో పొట్టేళ్ల దొంగలు హల్‌చల్‌.. రైతుల ఫిర్యాదులు పెరిగినా..

Andhra Pradesh : చిత్తూరులో పొట్టేళ్ల దొంగలు హల్‌చల్‌.. రైతుల ఫిర్యాదులు పెరిగినా..

Andhra Pradesh : చిత్తూరు జిల్లాలో పొట్టేళ్ల దొంగతనాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు ఆవులు, ఎద్దులు, బర్రెలను ఎత్తుకెళ్లే దొంగలు ఇప్పుడు పొట్టేళ్లపై కన్నేశారు. రాత్రి వేళల్లో గ్రామాల్లోకి చొరబడి, ఎవరికీ తెలియకుండా పొట్టేళ్లను దొంగిలించి మార్కెట్లలో అమ్మేస్తున్నారు.

తాజాగా ఈ తరహా సంఘటన గంగాధర నెల్లూరు మండలం పరిధిలో చోటుచేసుకుంది. వరుస దొంగతనాల కారణంగా గొర్రెల పెంపకందారులు గందరగోళానికి గురవుతున్నారు. గంగాధర నెల్లూరు, ఎస్‌.ఆర్‌.పురం, పెనుమూరు పోలీస్ స్టేషన్లకు రైతులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ దొంగతనాలు మాత్రం ఆగడం లేదు.

దొంగతనాలపై పోలీసులు సీరియస్‌గా స్పందించకపోవడంతో బాధితులు స్వయంగా చర్యలు చేపట్టారు. సంతలు, మార్కెట్లను సందర్శిస్తూ తమ పొట్టేళ్లను గుర్తించే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల తమ పొట్టేళ్లు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినా, అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“మా పొట్టేళ్లు మాయమైపోతున్నాయి, సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదు. కొందరు అధికారుల ప్రవర్తన కూడా నిర్లక్ష్యంగా ఉంది” అని బాధితులు తెలిపారు. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, దొంగలను పట్టుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి: Khammam Crime : భార్యపై అనుమానం.. ప్రేమించి చేసుకున్న పెళ్లి అలా ముగిసింది.. ఖమ్మం జిల్లాలో భయానక ఘటన
AP Crime News : వీడు మనిషేనా? భార్యను తాళ్లతో కట్టేసి బెల్ట్ తో కొడుతూ, కాళ్లతో తన్నుతూ భర్త పైశాచికం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు