HomeCrime NewsTelangana Crime : మామూలోడు కాదు.. రాష్ట్రంలోనే మోస్ట్ వాంటెడ్‌ రౌడీషీటర్‌ సూరి మళ్లీ పోలీసుల...

Telangana Crime : మామూలోడు కాదు.. రాష్ట్రంలోనే మోస్ట్ వాంటెడ్‌ రౌడీషీటర్‌ సూరి మళ్లీ పోలీసుల వలలో!

Telangana Crime : తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌గా పేరుగాంచిన రౌడీషీటర్‌ దాసరి సురేందర్‌ అలియాస్‌ సూరి మళ్లీ పోలీసుల చేతికి చిక్కాడు. వరంగల్‌ పోలీసుల టాస్క్‌ఫోర్స్‌ నిర్వహించిన ఆపరేషన్‌లో సూరితో పాటు మరో ఏడుగురు సహచరులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి రెండు రివాల్వర్లు, రెండు కత్తులు, మూడు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు.

రాచకొండ పోలీసులు నగర బహిష్కరణ చేసిన సూరి, మోహన్‌ లేదా మునీర్‌ పేర్లతో హనుమకొండలో తిష్ట వేసి, కొత్త నేరాల పథకాలు రచిస్తున్నాడు. భీమారం ప్రాంతంలో ఓ అద్దె ఇల్లు తీసుకుని, యువకులతో కలిసి దోపిడీలు, భూ వివాద సెటిల్‌మెంట్లు, బెదిరింపుల వంటి కార్యకలాపాలు కొనసాగించాడు. ఇటీవల శాయంపేట మండలం మాందారిపేట వద్ద ఓ లారీ డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి నగదు దోచుకోవడంతో కేసు బయటపడింది.

ఆ దోపిడీ కేసు విచారణలోనే సూరి గ్యాంగ్‌ బయటపడింది. పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ సాయంతో సూరి, శ్యామ్‌రాజ్‌, రాహుల్‌, శివమణి, శివవైభవ్‌, సామ్రాజ్‌ క్రాంతి, నితిన్‌, ఆదిత్యకుమార్‌ ఠాకూర్‌లను అరెస్టు చేశారు. వీరు భూపాలపల్లిలో ఓ హత్యకు సుపారి తీసుకున్నట్లు కూడా దర్యాప్తులో తేలింది.

సూరిపై మొత్తం 46 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి — వీటిలో సుపారి హత్యలు, భార్య హత్య, బావమరిది హత్య, దోపిడీలు, దొంగతనాలు, మర్డర్‌ కేసులు ఉన్నాయి. జైలులో ఉన్నప్పుడు ఇతర నేరస్తులతో పరిచయాలు పెంచుకొని, కొత్త నేర పథకాలు వేసినట్లు పోలీసులు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో మూడుసార్లు పీడీ యాక్ట్‌ ఎదుర్కొన్న ఏకైక నేరస్తుడు కూడా ఇతడే. చిక్‌కడపల్లి, ఎస్‌.ఆర్‌.నగర్‌, ఎల్‌.బీ.నగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అతనిపై పీడీ యాక్ట్‌లు నమోదు అయ్యాయి. ఏప్రిల్‌ 4న రాచకొండ పోలీసులు నగర బహిష్కరణ చేసినా, సూరి తన నేరాలను ఆపలేదు.

జైలులో పరిచయమైన ఆదిత్యకుమార్‌ ఠాకూర్‌ ద్వారా సూరి బీహార్‌ నుంచి రెండు పిస్టల్స్‌, 9 బుల్లెట్లు, ఒక కత్తి కొనుగోలు చేశాడు. గంజాయికి బానిసగా మారిన సూరి మత్తులో నేరాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు.

ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌ మాట్లాడుతూ, “సూరి గ్యాంగ్‌పై మరోసారి పీడీ యాక్ట్‌ నమోదు చేస్తాం. ఇలాంటి రౌడీషీటర్లను కఠినంగా ఎదుర్కొంటాం. సివిల్‌ వివాదాలు లేదా సెటిల్మెంట్లలో తలదూర్చిన వారిపై కూడా చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

ఇవీ చదవండి: Khammam Crime : భార్యపై అనుమానం.. ప్రేమించి చేసుకున్న పెళ్లి అలా ముగిసింది.. ఖమ్మం జిల్లాలో భయానక ఘటన
AP Crime News : వీడు మనిషేనా? భార్యను తాళ్లతో కట్టేసి బెల్ట్ తో కొడుతూ, కాళ్లతో తన్నుతూ భర్త పైశాచికం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు