HomeSportsSri Charani : ఏపీ సర్కార్‌ నుంచి మహిళా క్రికెటర్‌ శ్రీచరణికి ఘన గౌరవం.. రూ.2.5...

Sri Charani : ఏపీ సర్కార్‌ నుంచి మహిళా క్రికెటర్‌ శ్రీచరణికి ఘన గౌరవం.. రూ.2.5 కోట్ల నగదు, స్థలం, ఉద్యోగం

Sri Charani : భారత మహిళల క్రికెట్ జట్టు 2025 వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించింది. నవీ ముంబైలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి తొలిసారి ట్రోఫీని గెలుచుకుంది. ఈ చారిత్రక విజయానికి కడప జిల్లా యువ క్రికెటర్‌ శ్రీచరణి కీలక పాత్ర పోషించింది. తన అద్భుత బౌలింగ్‌ నైపుణ్యంతో మొత్తం టోర్నీలో 14 వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదపడ్డారు.

ముంబై నుంచి శుక్రవారం గన్నవరం చేరుకున్న శ్రీచరణికి ఏసీఏ (Andhra Cricket Association) ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, సవిత, సంధ్యారాణి తదితరులు ఆమెను పూలగుచ్ఛాలతో సత్కరించారు. “శ్రీచరణి ప్రదర్శన రాష్ట్ర గర్వకారణం” అని మంత్రులు తెలిపారు.

గన్నవరం నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్న శ్రీచరణి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్‌ను కలిసింది. ఈ సందర్భంగా జట్టులోని క్రికెటర్ల సంతకాలు ఉన్న టీషర్ట్‌ను సీఎం కు బహుమతిగా అందజేసింది. ఆమె ప్రతిభను ప్రశంసించిన సీఎం చంద్రబాబు, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీచరణికి భారీ నజరానా ప్రకటించింది —
₹2.5 కోట్లు నగదు బహుమతి
కడపలో 1000 చదరపు గజాల స్థలం కేటాయింపు
గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం

తరువాత మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీచరణి మాట్లాడుతూ, “ఏసీఏ ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచింది. ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన సలహాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ప్రజల ప్రేమ, అభిమానం నాకు మరింత ప్రేరణగా ఉంది. ఇంతటితో ఆగను.. ఇంకా చాలా సాధించాలి,” అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Team India : ప్రపంచకప్‌కు ముందే నంబర్ వన్‌గా స్మృతి మంధాన
Cricket : ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టిక్కెట్లు అతి తక్కువ రేట్లకు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు