HomeCrime NewsKhammam Crime : భార్యపై అనుమానం.. ప్రేమించి చేసుకున్న పెళ్లి అలా ముగిసింది.. ఖమ్మం జిల్లాలో...

Khammam Crime : భార్యపై అనుమానం.. ప్రేమించి చేసుకున్న పెళ్లి అలా ముగిసింది.. ఖమ్మం జిల్లాలో భయానక ఘటన

Khammam Crime : ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య అనుమానాలు, కలహాలు చివరికి భయానక మలుపు తిప్పాయి. ఏన్కూరు మండలం కాలనీ నాచారం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో గ్రామం మొత్తం షాక్‌కు గురైంది. భార్య పద్దతి మార్చుకోవడం లేదని అనుమానించిన భర్త ఆమెను గొడ్డలితో నరికి హతమార్చి, అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే:
స్థానికుల సమాచారం ప్రకారం, కాలనీ నాచారం గ్రామానికి చెందిన తాటి రామారావు, తాటి గోవర్ధన దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో ఇద్దరి మధ్య సఖ్యతగా సాగిన దాంపత్య జీవితం, గత కొంతకాలంగా అనుమానాలు, వాగ్వివాదాల వలన క్షీణించింది.

రామారావుకు తన భార్య గోవర్ధన మరో వ్యక్తితో అనైతిక సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానం పెరిగింది. ఈ విషయమై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో చర్చలు జరిగాయి. అయినా గోవర్ధనలో మార్పు రాకపోవడంతో రామారావు తీవ్ర ఆవేశానికి గురయ్యాడు.

హత్య అనంతరం పోలీసులకు లొంగిపోయిన భర్త
శుక్రవారం తెల్లవారుజామున రామారావు గొడ్డలితో గోవర్ధనపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం హత్యకు ఉపయోగించిన గొడ్డలితో సహా రామారావు ఏన్కూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.

ముగ్గురు పిల్లలు అనాథలుగా
మృతురాలు గోవర్ధనకు ముగ్గురు సంతానం ఉన్నారు. తల్లి మృతి, తండ్రి పోలీసుల కస్టడీలో ఉండటంతో పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

పోలీసుల విచారణ కొనసాగుతోంది
సూచన అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి: AP Crime News : వీడు మనిషేనా? భార్యను తాళ్లతో కట్టేసి బెల్ట్ తో కొడుతూ, కాళ్లతో తన్నుతూ భర్త పైశాచికం
Crime News : ఆమె కోసం చెన్నై వెళ్లిన యువకుడు.. ఊహించని విషాదం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు