Heroine : తెలుగు సినిమాల్లో ఆశించిన స్థాయిలో హిట్‌లు అందుకోలేకపోయినా, మలయాళ సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో సంచలనాన్ని సృష్టించిన హీరోయిన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆమె త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం ఫిట్ అండ్ ఫైన్ లుక్‌తో గ్లామర్ క్వీన్‌గా మారిపోయింది.
ఈమధ్య కాలంలో మలయాళ సినిమాల వరుస హిట్స్‌తో రాణిస్తున్న ఈ అందగత్తె మరెవరో కాదు – దర్శకుడు ప్రియదర్శన్, మాజీ హీరోయిన్ లిస్సీ దంపతుల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్. తెలుగు ప్రేక్షకులకు ఆమె అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ సినిమాతో పరిచయమే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.
తెలుగులో ఆమె చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోయినా, మలయాళ ఇండస్ట్రీలో మాత్రం కళ్యాణి స్టార్ స్థాయికి చేరింది. ఆమె నటించిన ‘లోకా: చాప్టర్ 1’ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయంతో ఆమె మలయాళ సినీ ప్రపంచంలో టాప్ హీరోయిన్ల సరసన నిలిచింది.
అభినయానికి ముందు ఆర్కిటెక్చరల్ డిజైన్ చదివిన కళ్యాణి, సినిమా రంగంలో ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆమె విక్రమ్ నటించిన ‘ఇరుముగన్’, హృతిక్ రోషన్ ‘క్రిష్ 3’ వంటి చిత్రాల్లో ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసింది. తరువాత ‘వరణీ అవశ్యముండ్’, ‘మరక్కర్: అరబికడలింటే సింహం’, ‘బ్రో డాడీ’, ‘హృదయం’, ‘తల్లుమల’ వంటి హిట్స్‌తో పాపులర్ అయింది.
ఇక ఆమె కీర్తి సురేష్‌కు మంచి స్నేహితురాలు అని కూడా చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఆమె సోదరుడు సిద్ధార్థ్ ప్రియదర్శన్ త్వరలోనే హీరోగా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు.
ఇవీ చదవండి: Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తానంటున్న యంగ్ హీరోయిన్
Actress : 58 ఏళ్ల హీరోకు తల్లిగా నటించిన 38 ఏళ్ల హీరోయిన్.. ఆ సినిమా వసూళ్లు రికార్డులు!
