HomeCinemaActress : 58 ఏళ్ల హీరోకు తల్లిగా నటించిన 38 ఏళ్ల హీరోయిన్.. ఆ సినిమా...

Actress : 58 ఏళ్ల హీరోకు తల్లిగా నటించిన 38 ఏళ్ల హీరోయిన్.. ఆ సినిమా వసూళ్లు రికార్డులు!

Actress : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలకు వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. పెళ్లి అయినా, 50 దాటినా.. వరుసగా హీరోలుగా సినిమాలు చేస్తూనే ఉంటారు. ఇక హీరోయిన్‌ల విషయానికి వస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. చాలా మంది పెళ్లి తర్వాత లేదా వయసు పెరిగేకొద్దీ తల్లి, అక్కలాంటి క్యారెక్టర్ రోల్స్‌లోకి మారిపోతారు. అయితే కొన్ని సార్లు తమకంటే వయసులో చాలా పెద్ద హీరోలకు కూడా తల్లిగా నటించాల్సిన పరిస్థితులు వస్తాయి.

అటువంటి ఉదాహరణలో ఒకటి రిధి డోగ్రా. హిందీ టెలివిజన్ సీరియల్స్‌లో బాగా పేరు తెచ్చుకున్న రిధి, అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో ఆమె యువ షారుఖ్ ఖాన్ తల్లిగా కనిపించింది. సినిమా వచ్చినప్పుడు షారుఖ్ ఖాన్ వయసు 58 ఏళ్లు, రిధి వయసు మాత్రం 38 ఏళ్లు మాత్రమే. అంటే తనకంటే 20 ఏళ్లు పెద్ద నటుడి తల్లిగా రిధి నటించింది.

తాజాగా రిధి ఈ అనుభవం గురించి మాట్లాడుతూ – “మొదట అట్లీ ఆఫీస్‌కి వెళ్లినప్పుడు నేను ఏ సినిమా కోసం వెళ్తున్నానో కూడా తెలియదు. ఆ తర్వాతే అది ‘జవాన్’ అని తెలిసింది. యువ షారుఖ్ తల్లిగా నటించమన్నప్పుడు మొదట షాక్ అయ్యాను. నేను ఈ పాత్రకి సరిపోతానా అన్న సందేహం కూడా వచ్చింది. కానీ షారుఖ్ సినిమాలో నటించే అవకాశం దొరకడం చిన్న విషయం కాదు. అందుకే అంగీకరించాను. ఇప్పటికీ ఆ అనుభవం ఒక కలలా అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చింది.

జవాన్‌లో షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం చేశారు. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో నటించగా, దీపికా పదుకొణే అతిథి పాత్రలో కనిపించింది. ఆజాద్ తల్లి ఐశ్వర్య రాథోడ్ పాత్రలో దీపికా కనిపించగా, రిధి డోగ్రా యంగ్ షారుఖ్ తల్లిగా కనిపించింది.

బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ‘జవాన్’ బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ రికార్డులు క్రియేట్ చేసింది. రిధి డోగ్రా మాత్రం ఈ సినిమా తన కెరీర్‌లో ఒక మైలురాయి అని భావిస్తోంది.

ఇవీ చదవండి: Heroine : 40 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరోయిన్ – సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ టాక్!
Shivani Nagaram: ‘లిటిల్ హార్ట్స్’తో కుర్రాళ్ల మనసు దోచుకున్న హీరోయిన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు