HomeCinemaDeepika Padukone : రోజుకు 8 గంటలే పని.. నాగురించే ఎందుకిలా వార్తలు? : దీపికా...

Deepika Padukone : రోజుకు 8 గంటలే పని.. నాగురించే ఎందుకిలా వార్తలు? : దీపికా పదుకొణె

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తాజాగా తన పని గంటలపై వస్తున్న వార్తలపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె “రోజుకు కేవలం 8 గంటలే పని చేస్తానని” చెప్పడంతో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆమె “స్పిరిట్”, “కల్కి 2” వంటి భారీ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్ అయ్యింది.

తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన దీపికా, తన పని విధానం గురించి వివరించారు. “ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సంవత్సరాలుగా రోజుకు 8 గంటలే పని చేస్తున్నారు. ఇది ఎవరికి కొత్త విషయం కాదు. కానీ నా విషయంలో మాత్రమే ఇది పెద్ద వార్తగా మారింది. నేను కూడా ఒక వ్యక్తినే. ఒక మహిళగా నాకు సౌకర్యంగా లేని పరిస్థితుల్లో పనిచేయడం ఇష్టం ఉండదు,” అని ఆమె అన్నారు.

ఇక న్యాయంగా తన హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు ఎదుర్కొన్న ఒత్తిడిపై ప్రశ్నించగా, దీపికా స్పందిస్తూ, “ఇలాంటి పరిస్థితులు నేను ముందే చాలాసార్లు ఎదుర్కొన్నాను. నేను నా పోరాటాలను నిశ్శబ్దంగానే చేస్తాను. వాటిని హైలైట్ చేయాల్సిన అవసరం నాకు అనిపించదు. గౌరవంగా ఉండడం అంటే సైలెంట్‌గా ఫైట్ చేయడం,” అని పేర్కొన్నారు.

ఇటీవల తల్లిగా మారిన దీపికా, ప్రస్తుతం షారుఖ్ ఖాన్ – సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లోని కొత్త చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ ప్రాజెక్టులో కూడా ఆమె కనిపించనుంది.

ఇవీ చదవండి: Sandeep Reddy Vanga : స్పిరిట్ నుంచి దీపికా పదుకొణె ఔట్.. సందీప్ రెడ్డి నిర్ణయం వెనుక ఏం జరిగింది?
Actress : 58 ఏళ్ల హీరోకు తల్లిగా నటించిన 38 ఏళ్ల హీరోయిన్.. ఆ సినిమా వసూళ్లు రికార్డులు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు