Pawan Kalyan : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో అద్భుతమైన హిట్స్ అందుకున్న హీరో. తొలిప్రేమ, ఖుషి, బద్రి, తమ్ముడు వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పవన్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుకుగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు తన సినిమాల ద్వారా ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నారు.
ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు మరియు ఓజీ సినిమాలతో పవన్ మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద తన మార్క్ చూపించారు. ముఖ్యంగా ఓజీ సినిమా భారీ విజయాన్ని సాధించి, పవన్ యాక్షన్ మరియు స్టైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే, తాజాగా యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫరియా, ఇటీవల ఓ టీవీ చిట్‌చాట్‌లో పాల్గొంది. సుమ అడిగిన “నీకు ఛాన్స్ వస్తే ఎవరితో డేట్ చేస్తావ్? ఎవరిని పెళ్లి చేసుకుంటావ్?” అనే ప్రశ్నకు ఫరియా ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆమె నవ్వుతూ, “ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తా… ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా” అని చెప్పింది. ఈ సమాధానం నెట్టింట వైరల్ అవుతూ, పవన్ మరియు ప్రభాస్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోషూట్‌లతో యువతను ఆకట్టుకుంటూ హాట్ టాపిక్‌గా మారింది.
ఇవీ చదవండి: OG Movie: తెలంగాణలోనూ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ బెనిఫిట్ షోలు.. టికెట్ రేట్లు ఇలా!
AP Assembly : బోండా ఉమ vs పవన్ కళ్యాణ్.. పొల్యూషన్ బోర్డుపై రగడ
