Heavy Rain Alert: వాయువ్య బంగాళాఖాతం సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వాతావరణం మారింది. ఈ అల్పపీడనం సగటు సముద్రమట్టం నుండి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి దక్షిణ దిశగా వాలిన ఉపరితల చక్రవాత ఆవర్తనాన్ని సృష్టించింది. దీని ప్రభావంతో చత్తీస్‌గడ్, విదర్భ, దక్షిణ మహారాష్ట్ర మీదుగా రుతుపవన ద్రోణి ఏర్పడింది. Heavy Rain Alert
⚠️ నేటి (సెప్టెంబర్ 13) వర్ష సూచనలు:
భారీ నుండి అతి భారీ వర్షాలు పడే జిల్లాలు: నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి.
భారీ వర్షాలు పడే జిల్లాలు: ఆదిలాబాద్, కొమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్.
రేపటి (సెప్టెంబర్ 14) వర్ష సూచనలు:
ఆదిలాబాద్, కొమరం భీం, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం.
👉 రెండు రోజులు మొత్తం రాష్ట్రంలో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
🚨 యాదాద్రి జిల్లాలో మూసి ఉగ్రరూపం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి మండలం జూలూరు వద్ద మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
పోచంపల్లి – బీబీనగర్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
వలిగొండ మండలం సంగెం గ్రామం భీమలింగం వద్ద లో లెవెల్ బ్రిడ్జ్ పై కూడా నీరు ప్రవహిస్తోంది.
చౌటుప్పల్ – భువనగిరి రహదారిపై రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.
ప్రమాదాలు జరగకుండా పోలీసులు రెండు వైపులా భారీ కేడ్లు ఏర్పాటు చేసి కాపలా కాస్తున్నారు. ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి: Andhra Rains: ఏపీలో భారీ వర్షాల అలర్ట్.. పిడుగులు పడే అవకాశం!
Water : వర్షాకాలంలో నీరు తాగే విధానం.. ఆరోగ్య రహస్యం?
