TGPSC Group 2 Jobs 2025: తెలంగాణలో గ్రూప్ పరీక్షల నియామకాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పటికే గ్రూప్ 1 నియామకాలు తుది దశకు చేరుకున్న సమయంలో హైకోర్టు మెయిన్స్ ఫలితాలను రద్దు చేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అయితే, ఈ స్థితిలో టీజీపీఎస్సీ (TGPSC) గ్రూప్ 2 నియామకాలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. TGPSC Group 2 Jobs 2025
కమిషన్ తాజాగా గ్రూప్ 2 పోస్టుల కోసం మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్ 13 ఉదయం 10.30 గంటల నుంచి నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుంది. వెరిఫికేషన్ సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించని వారు వాటిని సెప్టెంబర్ 15లోపు అందజేయవచ్చని కమిషన్ స్పష్టం చేసింది.
టీజీపీఎస్సీ ప్రకారం, మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచబడింది. ఎవరైనా హాజరు కాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు అవుతుందని, ఆ పోస్టు తరువాతి ర్యాంక్ ఉన్న వారికి కేటాయిస్తామని కమిషన్ కార్యదర్శి నవీన్ నికొలస్ తెలిపారు.
అలాగే ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ 1:1 నిష్పత్తిలో జరుగుతుందని, తరువాత తుది నియామక పత్రాలను అందజేస్తామని టీజీపీఎస్సీ స్పష్టంచేసింది.
ఇవీ చదవండి: Aurobindo Pharma : అరబిందో గ్రూప్‌పై అమెరికా ఆంక్షలు.. ప్లాంట్‌కు 8 అబ్జర్వేషన్లతో ఫామ్ 483
AP Groups Notification: నెలాఖరులోగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు.. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కీలక సూచనలు
