Andhra Rains: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సుమారు 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. అంతేకాకుండా, దక్షిణ అంతర కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. (Andhra Rains)
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రకారం, ఈ పరిస్థితుల కారణంగా గురువారం (11-09-2025) అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇక, బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు:
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం – 61 మిమీ
యలమంచిలి – 60.2 మిమీ
తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్ట – 49.5 మిమీ
నంద్యాల జిల్లా ముత్యాలపాడు – 49 మిమీ
అనకాపల్లి జిల్లా చోడవరం – 48.2 మిమీ
ఇవీ చదవండి: Mannara Chopra: వర్షంలో డ్యాన్స్.. మన్నారా చోప్రాపై దారుణమైన ట్రోలింగ్
Rain Alert Hyd: హైదరాబాద్‌లో భారీ వర్షం, రోడ్లు జలమయం
