HomeCinemaPushpa 3: పుష్ప 3పై ఆసక్తికర అప్ డేట్.. ఫ్యాన్స్‌కు సస్పెన్స్!

Pushpa 3: పుష్ప 3పై ఆసక్తికర అప్ డేట్.. ఫ్యాన్స్‌కు సస్పెన్స్!

Pushpa 3: ‘పుష్ప 3’ ఉంటుందా..? ఉంటే ఎప్పుడు వస్తుంది..? అనే ప్రశ్నలు ప్రస్తుతం సినీ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్‌లు కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి మూడో భాగంపై పడింది. (Pushpa 3)

ఇప్పటికే ‘పుష్ప 2’లో సుకుమార్ పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వదిలేశారని అభిమానులు అంటున్నారు. దాంతో మూడో పార్ట్ తప్పకుండా ఉంటుందని ఊహిస్తున్నారు. ముఖ్యంగా, ముందు వచ్చిన Where is Pushpa టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు ‘పుష్ప 2’లో కనిపించకపోవడం కూడా ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది.

ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే, ‘పుష్ప 2’ నార్త్‌లోనే 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బన్నీని నెంబర్ వన్ పీఠంపై కూర్చోబెట్టింది. దీంతో అభిమానులు సంతోషంగా ఉన్నా, మూడో భాగంపై సస్పెన్స్ మాత్రం వీరిని ఆలోచనలో పడేస్తోంది.

తాజాగా దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్‌లో పాల్గొన్న దర్శకుడు సుకుమార్ ఈ అంశంపై స్పందించారు. ‘పుష్ప 3 తప్పకుండా ఉంటుంది. కానీ అది సెట్స్‌పైకి రావడానికి కొంత సమయం పడుతుంది’ అని స్పష్టం చేశారు.

ఈలోపు అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేయనున్నారు. అదే సమయంలో సుకుమార్ కూడా రామ్ చరణ్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్‌ని పూర్తి చేయనున్నారు. వీటన్నింటి తర్వాతే ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ రూపుదిద్దుకునే అవకాశం ఉందని సమాచారం.

ఇవీ చదవండి: YS Jagan Pushpa Dialogue : రప్పా.. రప్పా.. జగన్ నోటి వెంట పుష్ప డైలాగ్ వైరల్
Pushpa 2 Collections: పుష్ప 2 రెండు రోజుల కలెక్షన్స్.. ఎంతో తెలుసా?
Pushpa 2 Trailer: పుష్ప 2 ట్రైలర్‌ను పట్టించుకోని మెగా హీరోలు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు