Pushpa 2 Trailer: అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం సీక్వెల్ పుష్ప 2 (Pushpa 2 Trailer) ట్రైలర్ నిన్న విడుదలైంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. అయితే, మెగా ఫ్యాన్స్ చాలా మంది ఈ ట్రైలర్ ను ఆకాశానికెత్తేస్తుండగా.. మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ట్రైలర్ అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు టాలీవుడ్ లోనూ పుష్ప మేనియా ఆవహించింది. ఈ తరుణంలో మెగా హీరోలు మాత్రం ట్రైలర్ ను పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది.
పుష్ప 2 అల్లు అర్జున్‌కి చాలా ప్రత్యేకమైన మూవీ. మెగా కాంపౌండ్‌కి ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయే సినిమా అనడంలో సందేహం లేదు. ఇది నార్త్ సర్క్యూట్ నుంచి వచ్చిన అన్ని హైప్‌లను అందించింది. ఇటీవల అల్లు అర్జున్, మెగా హీరోల మధ్య విభేదాలు బహిరంగంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు తన YSRCP స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి బహిరంగంగా బన్నీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. మిగతా హీరోలు, జబర్దస్త్ చోటా మోటా యాక్టర్లందరూ పవన్ కు మద్దతుగా పిఠాపురం వెళ్లి ప్రచారం చేశారు.
ఆ తర్వాత కూడా నాకు ఇష్టం ఉంటే ఎక్కడికైనా వెళ్తానని, లేకపోతే వెళ్లనంటూ అల్లు అర్జున్ కామెంట్స్ చేశాడు. రీసెంట్ గా వరుణ్ తేజ్ అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. నిన్న సాయంత్రం, పుష్ప 2 ట్రైలర్ విడుదలైంది. అయితే చిరంజీవి లేదా రామ్ చరణ్ సహా మెగా హీరోలు ఎవరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో దాని గురించి పోస్ట్ చేయలేదు.
ప్రతి వారం విడుదలయ్యే ప్రతి సినిమా గురించి ట్వీట్ చేసే సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ట్రైలర్ గురించి పల్లెత్తు మాట అనలేదు. ఒక్క ట్వీట్ కూడాచేయలేదు. ఇది మరేదైనా సినిమా అయితే మెగా హీరోలు పట్టించుకోకపోయినా పర్లేదని, మెగా హీరోలంతా ఏకమైతే అల్లు అర్జున్ కు మరింత బలం చేకూరుతుందన్న అభిప్రాయం కొందరు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 చాలా ప్రత్యేకమైన చిత్రం కాబట్టి అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీ రిలీజ్ అయి భారీ హిట్ అందుకుంటేనైనా మెగా హీరోలు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి: Pushpa 2 Trailer: పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్.. ఉత్తరాది ప్రేక్షకులకు పండగ
Pushpa 2: పుష్ప 2 ది రూల్ అడ్వాన్స్ బుకింగ్స్.. యూఎస్‌లో ఆ రికార్డు బద్దలు!
Pushpa2TheRule: ఒకటి తక్కువైంది.. ముందే పుష్పరాజ్ ఆగమనం!
Pushpa 2 Update: పుష్ప 2పై కీలక అప్ డేట్ ఇచ్చిన టీమ్.. అంచనాలను మించి..
