YS Jagan Pushpa Dialogue : మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు నిర్వహించిన మీడియాలో ఆయన వ్యాఖ్యలన్నీ ఒకఎత్తు అయితే, ఆఖర్లో మీడియా ప్రతినిధులు అడిగి ప్రశ్నల్లో భాగంగా పుష్ప సినిమా డైలాగ్ ప్రస్తావనకు రావడం మరోఎత్తుగా నిలిచింది. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (YS Jagan Pushpa Dialogue) పుష్ప 2 సినిమాలోని గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా..రప్పా నరుకుతా ఒక్కొక్కడినీ… అన్న డైలాగ్ ప్రస్తావనకు వచ్చింది.
మీడియా సమావేశం ముగుస్తుండగా విలేకరులు నిన్నటి ఘటనలను ప్రస్తావించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వైయస్సార్ సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ నిన్న వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన ఉదయం మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు సాగింది. అడుగడుగునా అభిమాన తరంగా జగన్ ను కలిశారు. ఆయన్ను చూసేందుకు తండోపతండాలుగా జనం తరలి వచ్చారు.
ఇందులో భాగంగా అభిమానులు కొన్ని ప్లకార్డులు పట్టుకుని కనిపించారు. ఇందులో పుష్ప సినిమా డైలాగులు, రాజారెడ్డి రాజ్యాంగం అంటూ వైయస్ రాజారెడ్డి ఫొటోలతో కొన్ని డైలాగులు రాసినవి అభిమానులు ప్రదర్శించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో డైలాగులు కూడా పెట్టారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ, కూటమి నేతలు కూడా అభ్యంతరం తెలిపారు.
ఇదే విషయాన్ని ఈరోజు జగన్ వద్ద విలేకరులు ప్రస్తావించగా.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రప్పా.. రప్పా అనే డైలాగును జగన్ పదే పదే విలేకరులను అడిగి మరీ చెప్పించారు. తాను కూడా చెప్పారు. ఇదంతా ప్రత్యర్థులను హెచ్చరించడానకేనని చూసిన వారికి ఇట్టే అర్థమవుతోంది. టీడీపీ కార్యకర్తే ఆ ప్లకార్డులను ప్రదర్శించాడంటూ మీడియా ప్రతినిధులు ఆధారాలను చూపించారు.
టీడీపీ అభిమానే చంద్రబాబు మోసాలకు భరించలేక మా పార్టీలోకి వచ్చి టీడీపీనే రప్పా రప్పా.. నరుకుతానంటూ ప్లకార్డులు ప్రదర్శించాడంటూ జగన్ చెప్పారు. అల్లు అర్జున్ మేనరిజాన్ని చూపిస్తూ గడ్డం ఇలా అన్నా.. గడ్డం అలా అన్నా తప్పేనా? పుష్ప సినిమా డైలాగులు ప్రదర్శిస్తే కూడా తప్పేనా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అంటూ జగన్ ప్రశ్నించారు. జగన్ నోట వచ్చిన పుష్ప 2 డైలాగ్ వైరల్ అయిపోయింది.
ఇవీ చదవండి: YS Jagan at Rentapalla : చంద్రబాబూ.. కమ్మవారిపై ఎందుకింత కక్ష? రెంటపాళ్లలో జగన్!
YS Jagan on Kuppam crime : కుప్పం దారుణంపై వైయస్ జగన్ రియాక్షన్
Pushpa 2 Trailer: పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్.. ఉత్తరాది ప్రేక్షకులకు పండగ
