HomeSportsRohit Sharma : ఆసుపత్రిలో రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

Rohit Sharma : ఆసుపత్రిలో రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

Rohit Sharma : భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం (సెప్టెంబర్ 8) రాత్రి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో కనిపించారు. ఆయన అకస్మాత్తుగా ఆసుపత్రి చేరుకోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రి బయట తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. (Rohit Sharma)

అయితే రోహిత్ ఎందుకు హాస్పిటల్‌కు వెళ్లారనే విషయంపై స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో “ఏమైంది రోహిత్‌కు?”, “హెల్త్ బాగానే ఉందా?” అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోహిత్ తన కారులో హాస్పిటల్‌కు చేరుకొని, లోపలికి వెళ్లే ముందు ఒకరిని కలిశారు. అనంతరం నేరుగా హాస్పిటల్‌లోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, రోహిత్ పూర్తిగా బాగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

రోహిత్ శర్మ – రాబోయే సిరీస్‌లు
తెలిసినట్టుగా, రోహిత్ ఇప్పటికే టెస్ట్, టీ20 క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే వన్డేల్లో ఇంకా భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌లో రోహిత్ పాల్గొననున్నట్లు సమాచారం.

అలాగే, ఆయన కెప్టెన్సీలో భారత్ ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గెలుచుకుంది. ఇక అక్టోబర్-నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లలో హిట్‌మ్యాన్ మళ్లీ యాక్షన్‌లో కనిపించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి: Gautam Gambhir : రోహిత్, కోహ్లీ, అశ్విన్ రిటైర్మెంట్ల వెనుక గంభీర్?
Rohit Sharma : టెస్టులకు రోహిత్ శర్మ వీడ్కోలు.. కెరీర్లో ఆటుపోట్లు ఇవీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు