Kajal Aggarwal: ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన కాజల్ అగర్వాల్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంది. స్టార్ హీరోలతో వరుస హిట్లు ఇచ్చిన ఆమె పెళ్లి, పిల్లల తర్వాత కొంత వెనక్కి తగ్గినా భగవంత్ కేసరి వంటి సినిమాలతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల భక్త కన్నప్ప చిత్రంలో పార్వతి దేవిగా కనిపించి మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం కూడా కొన్ని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం. Kajal Aggarwal
సినిమాల్లో తక్కువగా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటిలానే యాక్టివ్‌గా ఉంటుంది కాజల్. తన గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషన్ అప్‌డేట్స్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. అయితే గత కొన్ని గంటలుగా ఆమెపై ఒక షాకింగ్ రూమర్ నెట్టింట వైరల్ అయింది. కాజల్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైందని సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా ప్రచారం అయ్యాయి. కొన్ని ఫోటోలు కూడా షేర్ కావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
అయితే ఈ వార్తలు కాజల్ దృష్టికి చేరిన వెంటనే ఆమె క్లారిటీ ఇచ్చింది. తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేస్తూ—
“నాకు యాక్సిడెంట్ జరిగిందని, నేను ఇక లేను అన్నట్టుగా కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయి. అవన్నీ పూర్తిగా అబద్ధాలు. ఆ దేవుడి దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను. దయచేసి అలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి, మరీ ఇంకొకరికి షేర్ చేయకండి. సానుకూలత, నిజాలపై దృష్టి పెట్టండి. ప్రేమతో – మీ కాజల్” అని పేర్కొంది.
ఈ క్లారిటీతో కాజల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన యాక్సిడెంట్ రూమర్స్ అన్నీ నిరాధారమని తేలిపోయాయి.
ఇవీ చదవండి: Tollywood : అక్క హీరోయిన్.. చెల్లి కెరీర్ పీక్‌లో సినిమాలకు గుడ్ బై!
Tollywood News : అందం అడ్డుకువచ్చింది..! బిగ్ మూవీ నుంచి షాక్
