Putin : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. బుధవారం బీజింగ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన సైనిక పరేడ్ సందర్భంగా, వీరిద్దరూ మెల్లగా మాట్లాడుకున్న మాటలు దగ్గర్లోని మైక్రోఫోన్‌లో రికార్డ్ కావడంతో వెలుగులోకి వచ్చాయి. (Putin)
తియాన్మెన్ స్క్వేర్ గేట్ నుంచి పరేడ్ వీక్షణ వేదిక వైపు జిన్‌పింగ్, పుతిన్, ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ చర్చ జరిగింది. ఆ సమయంలో మానవ జీవిత కాలం, బయోటెక్నాలజీ భవిష్యత్తు గురించి మాటలాడారు.
పుతిన్ మాట్లాడుతూ –
“జీవసాంకేతిక విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధాప్యంలో పాడయ్యే అవయవాలను సకాలంలో కొత్తవాటితో మార్చేస్తే మనిషి చాలా ఎక్కువకాలం జీవించగలడు. బయోటెక్నాలజీతో మృత్యువుకే సవాలు విసరడం సాధ్యం” అని వ్యాఖ్యానించారు.
దీనికి జిన్‌పింగ్ స్పందిస్తూ –
“గతంలో 70 ఏళ్లు బతకడం అంటే గొప్ప విషయం. కానీ నేడు 70 ఏళ్ల వయసు చిన్నవాడిలాగే భావిస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తల ప్రకారం, వైద్య శాస్త్ర పరిశోధనల ఫలితాలను ఉపయోగించుకుంటే ఈ శతాబ్దంలోనే మనిషి 150 ఏళ్లు జీవించే అవకాశం ఉంది” అని అన్నారు.
ఈ మాటలు విని పక్కనే ఉన్న కిమ్ జోంగ్ ఉన్ చిరునవ్వు చిందించడం గమనార్హం. ఆయన నిజంగానే వీరి సంభాషణపై నవ్వారో, లేక సాధారణంగా నవ్వారో మాత్రం స్పష్టంగా తెలియలేదు.
ఈ సంభాషణ మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలకు అమర్చిన మైక్రోఫోన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారమైందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రస్తుతం జిన్‌పింగ్, పుతిన్ ఇద్దరూ 72 ఏళ్ల వయస్సులో ఉన్నారు. ఎన్నికల తర్వాత కూడా అధికారం కొనసాగించేందుకు ఇద్దరూ తమ తమ దేశ రాజ్యాంగాల్లో మార్పులు చేసి ఇప్పటికే మార్గం సుగమం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: Russia: పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపాలని..
GST Good News : మోదీ పన్ను సంస్కరణలు.. షాంపూలు, హైబ్రిడ్ కార్లు, టీవీలపై పన్నులు తగ్గింపు
PM Modi in China : ఏడేళ్ల తర్వాత చైనాలో మోదీ.. అమెరికాతో వైరం!
