Bank Holidays: ప్రతి నెలలాగే ఈ సెప్టెంబర్ 2025లో కూడా బ్యాంకులకు పలు సెలవులు ఉన్నాయి. మీరు బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన పనులు ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం ఈ నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు బంద్‌గా ఉండనున్నాయి. (Bank Holidays)
అయితే ఒక విషయం గమనించాలి.. అన్ని రాష్ట్రాల్లో సెలవులు ఒకేలా ఉండవు. ప్రతి రాష్ట్రం స్థానిక పండుగలు, ఉత్సవాలు, ప్రాంతీయ సందర్భాల ఆధారంగా ప్రత్యేకంగా బ్యాంకు సెలవులు ప్రకటిస్తుంది. కాబట్టి, మీరు బ్యాంకు వెళ్ళే ముందు మీ రాష్ట్రానికి సంబంధించిన హాలీడే లిస్ట్‌ను తప్పనిసరిగా చెక్ చేయాలి.
సెప్టెంబర్ 2025 బ్యాంక్ హాలీడేస్ లిస్ట్:
సెప్టెంబర్ 3 (బుధవారం): కర్మ పూజ – జార్ఖండ్
సెప్టెంబర్ 4 (గురువారం): ఫస్ట్ ఓనమ్ – కేరళ
సెప్టెంబర్ 5 (శుక్రవారం): ఈద్ ఇ మిలాద్, తిరువోణం
గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మిజోరాం, హైదరాబాద్, విజయవాడ, మణిపూర్, జమ్ము, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, శ్రీనగర్
సెప్టెంబర్ 6 (శనివారం): ఈద్ ఇ మిలాద్, ఇంద్రజాత్ర – సిక్కిం, ఛత్తీస్‌గఢ్
సెప్టెంబర్ 7 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు
సెప్టెంబర్ 12 (శుక్రవారం): ఈద్ ఇ మిలాద్ ఉల్ నబీ – జమ్ము, శ్రీనగర్
సెప్టెంబర్ 13 (శనివారం): రెండో శనివారం – దేశవ్యాప్తంగా
సెప్టెంబర్ 14 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు
సెప్టెంబర్ 21 (ఆదివారం): సాధారణ సెలవు
సెప్టెంబర్ 22 (సోమవారం): నవరాత్రి స్థాపన – రాజస్థాన్
సెప్టెంబర్ 23 (మంగళవారం): మహారాజ్ హరి సింగ్ జయంతి – జమ్ము, శ్రీనగర్
సెప్టెంబర్ 27 (శనివారం): నాలుగో శనివారం – దేశవ్యాప్తంగా
సెప్టెంబర్ 28 (ఆదివారం): సాధారణ సెలవు
సెప్టెంబర్ 29 (సోమవారం): మహా సప్తమి, దుర్గా పూజ – త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్
సెప్టెంబర్ 30 (మంగళవారం): మహా అష్టమి / దుర్గాష్టమి / దుర్గా పూజ – త్రిపుర, ఒడిశా, అస్సాం, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్
సెప్టెంబర్ 2025లో వారాంతపు సెలవులు, పండుగలు, ప్రాంతీయ సందర్భాలు కలిపి మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. కాబట్టి మీ బ్యాంకింగ్ పనులు చివరి నిమిషానికి వదలకుండా ముందుగానే చేసుకోవడం మంచిది.
ఇవీ చదవండి: Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏకంగా 17 రోజులు!
Telangana crime news: ‘జులాయి’ సీన్.. బ్యాంకుకు కన్నేసి రూ.13 కోట్ల బంగారం దోపిడీ!
